అన్నయ్యకి ఖైదీ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా?

Wed Jul 06 2022 19:00:01 GMT+0530 (India Standard Time)

Chiranjeevi Khaidi Sentiment Workout

మెగాస్టార్ చిరంజీవికి సరైన కమర్శియల్ సక్సెస్ పడి చాలా కాలమవుతోంది. కంబ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150' తర్వాత అన్నయ్యకి బ్లాక్ బస్టర్ పడలేదు. భారీ బడ్జెట్ తో  తెరకెక్కించిన 'సైరా నరసింహారెడ్డి 'భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవడంలో పరిపూర్ణత కనిపించలేదు. పీరియాడిక్ సినిమా మెగాస్టార్  అభిమానుల అంచనాల్ని అందుకోలేకపోయింది.



ఓ గొప్ప విప్లయ యోధుడి జీవిత కథని తీసుకుని తెరకెక్కించినా ఉయ్యాలవాడగా  చిరుని జీర్ణించుకోవడంలో కొన్ని లోపాలు కనిపించాయి. భారీ కాన్సాస్ పై చిత్రం తెరకెక్కిన సైరాలో ఏదో అసంతృప్తి అభిమానుల్ని వెంటాడింది. కమర్శియల్ సినిమా కాకపోవడం సహా ఎన్నో కారణాలు బాస్ వేగాన్ని తగ్గించినట్లు కనిపించింది.

అటుపై  ఇటీవలే రిలీజ్ అయిన 'ఆచార్య' ఇంకెలాంటి ఫలితాలు సాధించిందో కూడా తెలిసిందే. చరణ్-చిరంజీవి కలిసి నటించిన సినిమా ఇంత ఘోరంగా ఆడుతుందా? అని  పబ్లిక్ గానే విమర్శలు గుప్పించారు. తొలిసారి చిరంజీవి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి సైతం గురయ్యారు. అంటే 'ఆచార్య' ఫలితానికి ఈ ట్రోలింగ్ అనేది ఓ  నిదర్శనం. ఇలా రెండు సినిమాలు మెగా అభిమానుల్లో తీవ్ర నిరాశ..నిస్ఫృహల్ని మిగిల్చాయి.

ఇప్పుడు అభిమానులు సక్సెస్ దాహంతో ఎదురుచూస్తున్నారు. ఆదాహాన్ని చిరంజీవి సరైన బ్లాక్ బస్టర్ ఇచ్చి  తీర్చాల్సిన బాధ్యత అంతే కనిపిస్తుంది. అందుకే బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్ ల్ని లైన్ లో పెడుతున్నారు . 'గాడ్ ఫాదర్'..'వాల్తేరు వీరయ్య'..'భోళా శంకర్' ఆన్ సెట్స్ లో ఉన్నాయి. మెగాస్టార్ 154 టైటిల్ తో ఓ సినిమా రెడీ అవుతోంది.

వీటిలో ముందుగా రిలీజ్ అయ్యేది 'గాడ్ ఫాదర్' . ఓ పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇటీవలే చిరు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. మెగా అభిమానులకు ఆ పోస్టర్ బిగ్ ట్రీట్ ఇచ్చింది. అనయ్య కొట్టేలా ఉన్నాడనే సంకేతాలు ఫస్ట లుక్ పోస్టర్ తోనే పంపేసారు. తాజాగా మెగాస్టార్ అదిరిపోయే సెంటిమెంట్ తోనే థియేటర్లోకి వస్తున్నట్లు కనిపిస్తుంది.

అదిగానీ వర్కౌట్  అయితే మెగతా  ఫ్యాన్స్  ఆకలి  తీరినట్లే. ఇండస్ర్టీ హిట్ సైతం ఖాయం అనే టాక్ వినిపిస్తుంది. మరి ఆ సెంటిమెంట్ ఏంటి ?  వివరాల్లోకి వెళ్లాల్సిందే. 'గాడ్ ఫాదర్' లో చిరంజీవి ఖైదీ గా నటిస్తున్నారు. సరిగ్గా ఇదే సెంటిమెంట్ ఇప్పుడు మెగాస్టార్ ని బయటపడేసే ఛాన్స్ కనిపిస్తుంది. కెరీర్ ఆరంభంలోనే 'ఖైదీ' టైటిల్  సినిమాతో చిరు ఇండస్ర్టీ హిట్ అందుకున్నారు.

ఆ తర్వాత 'ఖైదీ నెంబర్ 786' తో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు.  'ఖైదీ' టైటిల్స్ నే కాదు చిరు ఖైదీ పాత్రలు పోషించిన  కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద  విజయ దుందుంబీ  మోగించాయి. 'గ్యాంగ్ లీడర్'..'రౌడీ అల్లుడు' లాంటి సినిమాల్లో కాసేపు ఖైదీ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక  కంబ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150' తో గ్రాండ్ గా రీ లీంచ్ అయ్యారు.

చిరు ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదని 150 రుజువు చేసింది. అలా చిరు ఖైదీ డ్రెస్ వేసిన ప్రతీసారి బాక్సాఫీస్ మోత మోగుతూనే  ఉంది.  తాజాగా 'గాడ్ ఫాదర్' లోనూ చిరు ఖైదీ గెటప్ వర్కౌట్ అవుతుందనే సంకేతాలు అందుతున్నాయి. 'గాడ్ ఫాదర్' కథ జైలులో ఎక్కువగా ఉంటుందని..కథలో మలుపులు అన్ని అక్కడే ఉంటాయని వినిపిస్తుంది. మరి  ఆలెక్క ఏంటి? అన్నది తేలాంటే 'గాడ్ ఫాదర్' రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న సంగతి  తెలిసిందే.