8 నెలల తర్వాత రెడీ అవుతున్న మెగాస్టార్

Thu Oct 29 2020 07:00:05 GMT+0530 (IST)

Megastar getting ready after 8 months?

మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమా షూటింగ్ వచ్చే నెల నుండి పునః ప్రారంభం కాబోతుంది. మార్చి నెలలో కరోనా కారణంగా నిలిచి పోయిన షూటింగ్ ను దాదాపు 8 నెలల తర్వాత పునః ప్రారంభించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. చిరంజీవి వయసు రీత్యా ఈ సినిమా షూటింగ్ ను ఇన్నాళ్లు ఆపాల్సి వచ్చిందని టాక్.ఇప్పటికే స్టార్ హీరోల నుండి సీనియర్ హీరోల వరకు పలువురు స్టార్స్ షూటింగ్ లను ప్రారంభించారు. చిరంజీవి మాత్రం ఇంకా కొరటాల శివను వెయిటింగ్ లో పెట్టాడు. కొరటాల తదుపరి సినిమాను చేయాల్సి ఉన్న కారణంగా చిరంజీవి మరీ ఆలస్యం చేయడం భావ్యం కాదని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎట్టకేలకు ఆచార్య సినిమా షూటింగ్ పునః ప్రారంభంకు సంబంధించి మెగా వర్గాల నుండి లీక్ అందింది. నవంబర్ 3వ వారం నుండి చిరంజీవి షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడట. చిరంజీవితో చేయాల్సిన సీన్స్ కు సంబంధించిన కొరటాల శివ ఏర్పాట్లు చేస్తున్నాడు. తక్కువ మంది నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు ఉండేలా టీమ్ జాగ్రత్తలు తీసుకుంటుందట. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా క్వారెంటైన్ లో ఉంచి ఆ తర్వాత చిరంజీవిని షూటింగ్ కు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో టీమ్ చర్యలు తీసుకుంటుందని సమాచారం.

మొత్తానికి నవంబర్ 3వ వారంలో షూటింగ్ కు హాజరు అయితే వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి వరకు షూటింగ్ ను పూర్తి చేసే అవకాశం ఉందని మెగా వర్గాల వారు అంటున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుండగా కీలక పాత్రలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు. చరణ్ కు జోడీగా రష్మిక మందన్న కూడా నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.