చిరు మాటలు అపార్థం చేసుకున్నారా?

Wed Oct 05 2022 07:00:01 GMT+0530 (India Standard Time)

Chiranjeevi Is Not Satisfied With Lucifer Reveals Making Worth Waiting

ఇటీవల  ఓ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ లూసిఫర్ చూశాక తాను సంతృప్తి చెందలేదని అందువల్ల తెలుగు వెర్షన్ `గాడ్ ఫాదర్ లో మార్పులు చేసేందుకు ప్రయత్నించానని చెప్పారు.అయితే లూసిఫర్ తో చిరంజీవి `సంతృప్తి చెందలేదు` అనే మాట మోహన్ లాల్ అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. గాడ్ ఫాదర్ కోసం మార్పులు చేసామని అనడం కూడా నచ్చలేదు.

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ ఇది హాట్ టాపిక్ గా మారింది.  ఈ చిత్రం దసరా రోజున అంటే అక్టోబర్ 5 న విడుదల కానుంది. సినిమా విడుదలకు ముందు మెగాస్టార్ తన తాజా వ్యాఖ్యతో లాల్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారారు. అంతేకాదు చిరు మాట్లాడిన వీడియోని వైరల్ చేస్తూ మోహన్ లాల్ అభిమానులు దానిపై కౌంటర్లు వేస్తున్నారు. మోహన్ లాల్ కి సరిరారు ఎవరూ! అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి మెగాస్టార్ చిరంజీవి మాటలను లాల్ అభిమానులు అపార్థం చేసుకున్నారనే చెప్పాలి. చిరు మాటల్లో ఎక్కడా లూసీఫర్ బాలేదని అనలేదు. ఆ సినిమా ఎంతో బాగా చేశారనే అన్నారు. కానీ తనకు భాష అర్థం కాక కొంత కన్ఫ్యూజ్ అయ్యానని కానీ తాను రీమేక్ చేసేందుకు అర్హమైన మంచి వైవిధ్యమైన సినిమా అని ప్రశంసించారు. తెలుగు సినిమా గాడ్ ఫాదర్ ని ఎక్కడా లూప్ హోల్స్ అనేవి లేకుండా ప్రతి ఫ్రేమ్ ని గ్రిప్పింగ్ గా చేశామని తన సినిమా గురించి చెప్పుకున్నారు కానీ లూసీఫర్ ని విమర్శించనే లేదు. తన మాటల్లో ఎక్కడా మోహన్ లాల్ ని కానీ లూసీఫర్ మూవీ ఘనతను కానీ కించపరచలేదు. అయినా కానీ ఫ్యాన్స్ తప్పుగా అర్థం చేసుకుని చిరుపై కౌంటర్లు వేస్తున్నారు.

మోహన్‌లాల్- వివేక్ ఒబెరాయ్ మరియు ఇతరులు ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్ కి అధికారిక తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తుందని అంచనాలు వెలువడ్డాయి. గాడ్ ఫాదర్ ట్రైలర్ ఆకట్టుకుంది.

చిరు ఇమేజ్ కి తగ్గట్టు గాడ్ ఫాదర్ లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారు. ఒరిజినల్ చూసిన తర్వాత నా ఇమేజ్ కి తగ్గట్టు మార్పులు చేయాలని సూచించానని చిరు అన్నారు. మోహన్ రాజా తెలుగు వెర్షన్ లో మార్పులు చేసిన తర్వాత నేను ఎదురుచూస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ అని నాకు అనిపించింది. మేము దానిని అప్ గ్రేడ్ చేసాము. లూప్ హోల్స్  లేకుండా అత్యంత ఆకర్షణీయంగా చేసాము. ఇది ఖచ్చితంగా మీ అందరికీ సంతృప్తినిస్తుంది!  అని కూడా చిరు అన్నారు. కొందరు రీమేక్ లతో ఒప్పించలేదు. నా విషయానికొస్తే నేను రీమేక్ చేసిన సినిమాలన్నీ చాలా వసూళ్లు రాబట్టాయి. గాడ్ ఫాదర్ రేపు తెలుగు- హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు అని చిరు అన్నారు. అందరికీ నచ్చుతుందని కూడా అన్నారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నిర్మాత ఎన్.వి ప్రసాద్ మాట్లాడుతూ.. ``లూసిఫర్ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ చూశారు. చరణ్ కి ఫోన్ చేసి రీమేక్ రైట్స్ కొనమని సూచించారు. ఆ తర్వాత మెగాస్టార్ కి చూపించగా ఆయన సినిమా చేయడానికి అంగీకరించారు. అవకాశం ఇచ్చిన చిరంజీవిగారికి చరణ్‌కి ధన్యవాదాలు`` అని అన్నారు.

అయితే చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే లాల్ అభిమానులు కోపంగా స్పందించారు. మోహన్ లాల్ ఆల్ టైమ్ బెస్ట్ అని సూచించారు. అభిమానుల కామెంట్లు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.