Begin typing your search above and press return to search.

చిరంజీవి హెల్త్‌ అప్డేట్‌.. డాక్టర్లు ఏమన్నారంటే!

By:  Tupaki Desk   |   28 Jan 2022 9:30 AM GMT
చిరంజీవి హెల్త్‌ అప్డేట్‌.. డాక్టర్లు ఏమన్నారంటే!
X
మెగాస్టార్‌ చిరంజీవి ఇటీవల కరోనా బారిన పడ్డట్లుగా స్వయంగా ప్రకటించిన విషయం తెల్సిందే. స్వల్ప లక్షణాలతో కోవిడ్‌ పాజిటివ్ గా నిర్థారణ అయిన చిరంజీవి ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. షూటింగ్‌ మరియు సినిమా ఫంక్షన్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని పూర్తిగా ఇంటికే పరిమితం అయిన చిరంజీవి ఇంకా కూడా స్వల్ప కోవిడ్ లక్షణాలతో బాధ పడుతున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవిని రెగ్యులర్‌ గా అపోలో వైధ్యులు పరీక్షిస్తున్నారట. అపోలో కు చెందిన వైధ్యుల సూచనలు మరియు సలహాలతో డైట్ ఫాలో అవుతూ చిరంజీవి ఐసోలేషన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం చిరంజీవి స్వల్పంగా బాడీ పెయిన్స్‌ తో బాధ పడుతున్నాడట. మొదటి రెండు మూడు రోజులు జ్వరంతో బాధ పడ్డ చిరు కు ఇప్పుడు జ్వరం లేదట. బాడీ పెయిన్స్ తో పాటు స్వల్ప అస్వస్థతగా ఉన్నట్లుగా చెబుతున్నారు. వారం రోజుల్లోనే చిరంజీవి పూర్తిగా రికవరీ అయ్యే అవకాశం ఉందని.. ఆయన ఫిబ్రవరి రెండవ వారం నుండి మళ్లీ షూటింగ్స్ కు హాజరు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎంతో మంది స్టార్‌ హీరోలు మరియు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. థర్డ్‌ వేవ్ లో ఎక్కువ మంది కోవిడ్‌ బారిన పడ్డా కూడా ఇబ్బంది పడ్డ వారు మాత్రం చాలా తక్కువే.

గతంలో కూడా చిరంజీవి కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. ఆ సమయంలో ఆయనే స్వయంగా తనకు కోవిడ్‌ అంటూ ప్రకటించాడు. అయితే తదుపరి టెస్ట్‌ లో కోవిడ్‌ లేనట్లుగా నిర్థారణ అయ్యిందని చిరంజీవి పేర్కొన్నాడు. మళ్లీ ఇప్పుడు చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఇటీవలే రామ్‌ చరణ్ కూడా కోవిడ్‌ బారిన పడ్డ విషయం తెల్సిందే. చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన కోవిడ్‌ బారిన పడటం వల్ల ప్రతి ఒక్క సినిమా కూడా రీ షెడ్యూల్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి అయ్యి విడుదలకు సిద్దంగా ఉంది.

మరో వైపు గాడ్ ఫాదర్ సినిమా మరియు భోళా శంకర్ సినిమాల షూటింగ్ లు జరుగుతున్నాయి. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా బాబీ దర్శకత్వంలో కూడా ఒక సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. అతి త్వరలోనే సినిమా ను పట్టాలెక్కించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అధికారికంగా దర్శకుడు వెంకీ కుడుమల ఏర్పాట్లు చేస్తున్నాడు.

చిరంజీవి ఆరోగ్యం కుదుట పడ్డ వెంటనే మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ అయిన లూసీఫర్ కు రీమేక్ గా రూపొందుతున్న గాడ్ ఫాదర్ సినిమా చిత్రీకరణ లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న గాడ్ ఫాదర్ సినిమా కు తమిళ దర్శకుడు మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక వేదాళం ను తెలుగు లో భోళా శంకర్ గా రీమేక్ చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ రీమేక్ రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమా లు కూడా ఇదే ఏడాది లో విడుదల చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ రెండు సినిమాలు ఆచార్య తో పాటు ఈ ఏడాది విడుదల అయితే మొత్తం ఈ ఒక్క ఏడాదిలోనే చిరంజీవి మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు అవుతుంది.

వచ్చే ఏడాది ఆరంభంలో బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక పై ఏడాదికి రెండు మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మెగా స్టార్‌ చిరంజీవి పేర్కొన్నాడు. కరోనా వల్ల గత రెండేళ్లుగా ఆయన సినిమాలు ఏమీ రాలేదు. సైరా వచ్చి దాదాపు నాలుగు ఏళ్లు అవుతుంది.

అయినా కూడా ఆయన తదుపరి సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇక ముందు వచ్చే సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేయడం ఖాయం అంటున్నారు. చిరంజీవి పక్కా ప్లాన్‌ తో సినిమా సినిమాకు పెద్దగా గ్యాప్‌ లేకుండా మూడు నాలుగు నెలల్లో ఒక సినిమాను పూర్తి చేసే వ్యూహంతో ముందుకు వెళ్తున్నాడు. ఈ సమయంలో ఆయన కరోనా బారిన పడటం విచారకరం. వెంటనే ఆయన కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు