Begin typing your search above and press return to search.

ఆ టాలెంటెడ్ దర్శకుడితో మెగాస్టార్ చర్చలు

By:  Tupaki Desk   |   7 Feb 2023 7:00 PM GMT
ఆ టాలెంటెడ్ దర్శకుడితో మెగాస్టార్ చర్చలు
X
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ టాలెంటెడ్ దర్శకులతో తన స్టైల్ లో , తన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యే కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ కథలు చేయాలని భావిస్తున్నారు. గాడ్ ఫాదర్ కి ముందుగా కొన్ని ప్రయోగాలు చేసిన అవి వర్క్ అవుట్ కాలేదు. అయితే తన స్టైల్ లో వచ్చిన వాల్తేర్ వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

దీంతో ప్రేక్షకులు తనని ఎంటర్టైనర్ గానే చూడటానికి ఇష్టపడుతున్నారు అని చిరంజీవికి క్లారిటీ వచ్చింది. కొత్తదనం ఉండి సీరియస్ గా సాగే పాత్రల కంటే తమలో మాస్ లీడర్ లో పాత్రలకి ఆసక్తి చూపిస్తున్నారు.

ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తూ తమ కోసం పోరాడే మాస్ లీడర్ గానే చిరంజీవిని చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఈ కారణంగానే వాల్తేర్ వీరయ్య సూపర్ సక్సెస్ అయ్యింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ కూడా అదే ఫ్లేవర్ లో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇక తనతో సినిమాలు చేయాలని అనుకుంటున్న దర్శకులకి కూడా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కథలని తీసుకొని రమ్మని చిరంజీవి సూచిస్తున్నట్లు తేలుతుంది. ఇదిలా ఉంటే ఫ్యామిలీ కథలతో ఫేమస్ నారప్ప సినిమాతో మరల ఫామ్ లోకి వచ్చిన టాలెంటెడ్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.

నారప్ప తర్వాత మరల సొంత కథతో సినిమా చేయడానికి శ్రీకాంత్ చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. శర్వానంద్ తో సినిమా ఉంటుందని అందరూ భావించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో శ్రీకాంత్ అద్దాల సినిమా చేయడానికి ఒకే చెప్పాడు. అయితే అది ఎప్పుడు మొదలవుతుంది అనేది క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల మెగాస్టార్ చిరంజీవిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.

గతంలో ఓ సారి శ్రీకాంత్ మెగాస్టార్ ని కలిసి కథ చెప్పారు. అయితే ఆ సమయంలో శ్రీకాంత్ కథ తనకి అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాలేదు. అయితే మరోసారి శ్రీకాంత్ అదిరిపోయే స్టొరీ లైన్ సిద్ధం చేసుకొని మెగాస్టార్ ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మెహర్ రమేష్ లాంటి డిజాస్టర్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి తనకి ఇస్తారని శ్రీకాంత్ అద్దాల భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.