నిన్న రామ్ చరణ్.. ఇప్పుడు మెగాస్టార్

Thu Jan 20 2022 18:34:52 GMT+0530 (IST)

Chiranjeevi About Shyam Singha Roy

నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట్ బోయినపల్లి అత్యతం ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నాని డ్యుయెల్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో సాయి పల్లవి కృతిశెట్టి మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ లుగా నటించారు. కోల్ కతా నేపథ్యంలో సాగే టైమ్ ట్రావెలింగ్ స్టోరీగా ఈ మూవీ విశేష ఆదరణ సొంతం చేసుకుంది. డిసెంబర్ 24న తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తో పాటు భారీ వసూళ్లని రాబట్టి నాని కెరీర్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రంగా నిలిచింది.నేచురల్ స్టార్ నాని కెరీర్ లో బ్లాక్ బస్టర్ క్లాసిక్ మూవీగా నిలిచిన `శ్యామ్ సింగ రాయ్` పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది. ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ నేచురల్ స్టార్ నాని రెండు పాత్రల్లోనూ మెరిశాడని మరీ ముఖ్యంగా శ్యామ్ సింగ రాయ్ పాత్రలో సర్ ప్రైజ్ చేశాడని అలాగే సాయి పల్లవి దేవ దాసీ పాత్రలో అద్భుతంగా నటించిందని ఇప్పటి వరకు వీరిద్దరి కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందించిన సినిమా ఇదేనని ప్రశంసలు కురిపించారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ చూసిన తరువాత హీరో నేచురల్ స్టార్ నాని సాయి పల్లవిలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటి వరకు వీరి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదేనని ఈ సందర్భంగా ఈ ఇద్దరితో పాటు కృతిశెట్టి మడోన్నా సెబాస్టియన్ లకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీని ప్రత్యేకంగా తిలకించారు. ఆ విషయాన్ని హీరో నాని తెలియజేస్తూ చిరుతో కలిసి దిగిన ఓ ఫొటోని సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

శ్యామ్ ని ప్రేమించింది ఎవరో గెస్ చేయండి` అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. `శ్యామ్ సింగ రాయ్` చిత్రంతో శ్యామ్ సింగ రాయ్ పాత్ర మీసం మెలేసే సన్నివేశం హైలైట్ గా వుంటుంది. అదే మేనరిజాన్ని ప్రదర్శిస్తూ చిరు నాని ఫొటోలకు పోజివ్వడం ఆకట్టుకుంటోంది. అంటే `శ్యామ్ సింగ రాయ్` ఎలా వుందో మెగాస్టార్ చిన్న మేనరిజమ్ తో చెప్పారన్న మాట. నాని ట్వీట్ చేసిన ఈ స్టిల్ ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. ఇదిలా వుంటే `శ్యామ్ సింగ రాయ్` జనవరి 21న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.