Begin typing your search above and press return to search.

వైర‌ముత్తుపై చ‌ర్య‌లు తీసుకోండి.. సీఎంకి చిన్మ‌య లేఖాస్త్రం

By:  Tupaki Desk   |   30 May 2023 9:08 AM GMT
వైర‌ముత్తుపై చ‌ర్య‌లు తీసుకోండి.. సీఎంకి చిన్మ‌య లేఖాస్త్రం
X
గత ఐదేళ్లుగా గాయ‌ని చిన్మయి నిరంతరం వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ప్రముఖ గీత రచయిత వైర‌ముత్తుపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కూడా కోరుతున్నా ఫ‌లితం లేదు. ఇంతకుముందు దీనిపై కోర్టుల ప‌రిధిలో విచార‌ణ కూడా జ‌రిగింది. కానీ ఎలాంటి శిక్ష వైర‌ముత్తుకు ప‌డ‌లేదు. వీలున్న ప్ర‌తి వేదిక‌పైనా వైర‌ముత్తు వేధింపుల ప్ర‌హ‌స‌నం గురించి ప్ర‌స్థావిస్తూ అత‌డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చిన్మ‌యి కోరుతోంది. ఇప్పుడు మ‌రోసారి స‌ద‌రు సీనియ‌ర్ గీత రచయిత పై చర్యలు తీసుకోవాలని తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ ను చిన్మయి అభ్యర్థించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ను సుదీర్ఘ ట్విట్టర్ పోస్ట్ లో చిన్మ‌యి ఏం అభ్య‌ర్థించారో వివ‌రాల్లోకి వెళితే..

కమల్ హాసన్ సెలెక్టివ్ ఔట్ రేజ్ కి పిలుపునిచ్చిన కొన్ని రోజుల తరువాత గాయని చిన్మయి శ్రీపాద పలువురు మహిళలను వేధించిన‌ గీత రచయిత వైరముత్తుపై చర్య తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్‌కు ట్వీట్ చేశారు. #MeToo ఉద్యమం సమయంలో డీఎంకే పార్టీ సభ్యులు స్టాలిన్ తో సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఈ అంశంపై నోరు మెదపలేద‌ని చిన్మయి ఆరోపించింది. తమిళనాడులోని పని ప్రదేశాలన్నీ మహిళలకు సురక్షితంగా ఉండేలా చూడాలని ఆమె తమిళనాడు సీఎంను అభ్యర్థించారు.

చిన్మయి సుదీర్ఘ ప్ర‌క‌ట‌న సారాంశం ఇలా ఉంది. ''గౌరవనీయులైన ముఖ్యమంత్రి సార్... భారతదేశం అంతటా లైంగిక వేధింపులకు గురైన వారికి న్యాయం జరిగేందుకు మీరు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. రాజకీయ నేతలు మాట్లాడితే మార్పు వస్తుందనే ఆశ కలుగుతోంది. అయితే ఇంకా ఈ వేధింపుల‌ను నిర‌సించేందుకు ఎటువంటి వ్యవస్థలు లేవు - అనేక పరిశ్రమలలో ముఖ్యంగా చలనచిత్ర పరిశ్రమలో ICC లేదా POCSO చ‌ట్టాలు లేవు. 17 మంది పైగా మహిళలు మీ స్నేహితుడు/సపోర్టర్ కి అండ‌గా నిలుస్తూ మిస్టర్ వైరముత్తు అని పేరు పెట్టారు. అతడు మీ సామీప్యాన్ని ఆస్వాధిస్తూనే ఉన్నాడు. అతను ప్ర‌శ్నించే మహిళలను ఆప‌గ‌ల‌డు. అంద‌రినీ సైలెంట్ చేయడానికి అధికారం ఉపయోగిస్తాడు. తమిళనాడులోని ఇతర రాజకీయ నాయకుల మాదిరిగానే మీ పార్టీ కూడా ఆయనకు అండ‌నిచ్చే వేదికగా నిలుస్తోంది.

ఆమె ఇంకా మాట్లాడుతూ-''తమిళ చలనచిత్ర పరిశ్రమలో దాదాపు 5 సంవత్సరాలు ఎలాంటి పని ఇవ్వ‌కూడ‌ద‌నే నిషేధాన్ని ఎదుర్కొంటూ... హోన్బుల్ సిటీ సివిల్ కోర్టులో కేసును ఎదుర్కొంటున్నాను. ఈ కేసు విష‌యంలో అంతం కనిపించడం లేదు. ఈ దేశంలో మనకు కనెక్షన్లు (సంబంధాలు) లేదా పలుకుబడి లేనప్పుడు న్యాయం జరగడానికి మరో 20 ఏళ్లు పట్టవచ్చు. అయినా దీనితో పోరాడే శక్తి నాకు ఉంది. నేను 2018-2019లో తిరిగి NCWకి ఫిర్యాదు చేసాను.

ఎందుకంటే మాలో చాలా మందికి అందుబాటులో ఉన్న ఏకైక మార్గం అదే. దర్యాప్తు చేయడానికి ఇంటికి వచ్చిన పోలీసు అధికారులకు చేతితో రాసిన ఫిర్యాదును అందజేశాను. 'రాజీ'కి రావడానికి వైరముత్తు కాల్ ను ఏర్పాటు చేసిన ఫోన్ కాల్ రికార్డులు సహా నా దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. అతని కుమారుడు మధన్ కార్కీకి కూడా టెక్స్ట్ ద్వారా సమాచారం అందించాను. దానికి అతను కాల్ చేసి స్పందించాడు. చాలా సంవత్సరాల క్రితం తన తండ్రి ప్రవర్తన గురించి తనకు త‌న కుటుంబానికి ముందే తెలుసునని అంగీకరించాడు. వైరముత్తు - బ్రిజ్ భూషణ్ లకు నిబంధనలు భిన్నంగా ఉండకూడదు... అని లేఖ‌లో ఘాటుగా పేర్కొన్నారు.

గాయని చిన్మ‌యి ఈ సమస్యను ఢిల్లీలో కొనసాగుతున్న రెజ్లర్ల నిరసనలతో పోల్చారు. ''మా ఛాంపియన్ రెజ్లర్లు .. ఒక మైనర్‌ సహా దేశం గర్వించేలా బ్రిజ్ భూషణ్ పేరు పెట్టారు. 17 మంది మహిళలు మీ పార్టీకి మీతో ఉన్న సామీప్యాన్ని ఉపయోగించి నన్ను నాతో పాటు ఇతరులను సైలెంట్ చేయడానికి ప్రతిభావంతులైన - కలలు కనే మహిళల కెరీర్ ను నాశనం చేయడానికి 'వైరముత్తు' అని పేరు పెట్టారు. అతని ప్రతిభ మనందరి కంటే గొప్పది కాదు'' అని చిన్మ‌యి వ్యాఖ్యానించారు.

ఇదంతా మీ(సీఎం) ప‌రిధిలో జ‌రుగుతోంది. దయచేసి తమిళనాడులోని కార్యాలయాలు సురక్షితంగా ఉండేలా అవసరమైనవి చేయండి. కవికి రాజకీయ సంబంధాలు ఉన్నందున అతనిపై మాట్లాడటానికి బాధిత ప్రజలు చాలా భయపడతారు.. కాబట్టి పరిశ్రమ నుండి బహిష్కర‌ణ‌కు గురైన మ‌హిళ‌గా నేను మాట్లాడుతున్నాను. దయచేసి నా పరిశ్రమలో ICCలు POCSO యూనిట్ లు ఉన్నాయని నిర్ధారించుకోండి పిల్లలు మాస్ మీడియాలో ఉద్యోగం చేస్తున్నారు. పిల్లలు లైంగిక వేధింపుల నుండి సురక్షితంగా ఉండాలి. చాలా మంది మహిళలు పురుషులు TV ప‌రిశ్ర‌మ‌ అలాగే సినీప‌రిశ్ర‌మ‌లో లైంగిక వేధింపులను ఎదుర్కొంటూనే ఉన్నారు... అని లేఖ‌లో వ్యాఖ్యానించారు.