ఫోటో స్టోరి: చికెన్ సూప్ Vs థై షోస్.. సింక్ కాలేదే

Sun Aug 02 2020 07:00:03 GMT+0530 (IST)

Photo Story: Chicken Soup Vs thighs Shows .. Can't Sync

వైభవి శాండిల్య.. పేరు బావుంది. కానీ మరీ ఈ రేంజులో ట్యాలెంట్ చూపించేస్తున్న ఈ బ్యూటీకి అంతుందా అంటారా? ఇదిగో .. ఇలా థై షోస్ ఎగ్జిబిషన్ కి పెట్టేయడంతో ఎవరీ అమ్మడు? అంటూ ఆరాలు మొదలయ్యాయి. చికెన్ సూప్ స్పెషల్ అని ముద్రించి ఉన్న ఆ బుక్ లో ఉందో కానీ.. ఈ భామ గురించి వెతికితే తెలిసిన సంగతులివి..వైభవి షాండిల్య .. బహుభాషా నటి. తమిళం.. మరాఠీ.. తెలుగు చిత్రాల్లో నటించింది. 2015లో మరాఠీ చిత్రం జనివాతో తెరంగేట్రం చేసిన తరువాత ఏక్ అల్బెలా- సక్కా పోడు పోడు రాజా- ఇరుట్టు అరాయిల్ మురట్టు కుత్తు- కాప్ మారి వంటి చిత్రాల్లో నటించింది.

సాంఘిక న్యాయం నేపథ్యంలో మరాఠీ చిత్రం జనివా (2015) లో వైభవి నటనకు పేరొచ్చింది. నటుడు మహేష్ మంజ్రేకర్ కుమారుడు సత్య డెబ్యూ చిత్రం కావడంతో ఆసక్తిని పెంచింది. భగవాన్ దాదా బయోపిక్- ఏక్ అల్బెలాలో విద్యాబాలన్ సహా వైభవి కీలక పాత్ర పోషించింది. అందులో షాహీన్ అనే ముస్లిం అమ్మాయిగా నటించింది. 2016 లో వైభవి ఈజిప్టు అరబిక్ చిత్రం గహేమ్ ఫే ఎల్ హెండ్ లో `తక్ ధినా` అనే ప్రత్యేక పాటలో నర్తకిగా కనిపించింది. దీనికి ప్రముఖ ఇండియన్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విష్ణు దేవా కొరియోగ్రఫీ చేశారు. సంతానం - సర్వర్ సుందరం .. సక్కా పోడు పోడు రాజా లాంటి తమిళ చిత్రాలలోనూ నటించింది. వైభవి గౌతమ్ కార్తీక్ సరసన ఇరుట్టు అరాయిల్ మురట్టు కుత్తు చిత్రంలో నటించింది.

2020 లో మూడు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. సర్వర్ సుందరం సంజన - ఈసల్-పట్టాకి అనే చిత్రాలతో పాటు కన్నడలో గాలి పట సీక్వెల్ చిత్రంలోనూ నటిస్తోంది. టాలీవుడ్ లో ఆది సాయి కుమార్ సరసన నెక్స్ట్ నువ్వే అనే చిత్రంలోన ఆడిపాడింది. ఇందులో జబర్ధస్త్ రేష్మి ఒక కథానాయిక. ఈ అమ్మడి జోరు చూస్తే ఇకపైనా తెలుగులోనూ ఛాన్సులిస్తారేమో!