'చెక్' వీడియో సాంగ్ రిలీజ్.. ఒకరినొకరు చూడకుండా ఉండలేకున్నారట..!

Tue Feb 23 2021 20:06:32 GMT+0530 (IST)

'Check' video song release

నితిన్ హీరోగా.. రకుల్ ప్రీత్ సింగ్ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం చెక్. ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద ప్రసాద్ నిర్మించారు. మరో మూడు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో వీడియో సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.'నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను' అంటూ సాగే ఈ యుగళ గీతం.. ఫాస్ట్ బీట్ లో అద్భుతంగా అలరిస్తోంది. సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ అందించిన అద్భుతమైన ట్యూన్ కు మంచి లిరిక్స్  సూటబుల్ కొరియో గ్రఫీ తోడవడంతో వీడియో సాంగ్ పై మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవుతోంది. ఇక ఈ సాంగ్ ను చిత్రీకరించిన లొకేషన్లు కూడా చాలా బాగున్నాయి.

వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ నితిన్ పై ఈ సాంగ్ ను చిత్రీకరించారు. బ్యూటీఫుల్ రొమాంటిక్ సాంగ్ గా సాగిపోతున్న ఈ పాటలో నితిన్ ప్రియా ప్రకాష్ మధ్య కెమిస్ట్రీ సూపర్బ్ గా ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీని ఫిబ్రవరి 26 న రిలీజ్ చేయబోతున్నారు.