Begin typing your search above and press return to search.

'గే' అని ఆ బ్యూటీ పై జ‌రుగుతోన్న ప్ర‌చారానికి చెక్!

By:  Tupaki Desk   |   31 May 2023 9:43 PM GMT
గే అని ఆ బ్యూటీ పై జ‌రుగుతోన్న ప్ర‌చారానికి చెక్!
X
ఈ ఏడాది విశ్వ‌సుంద‌రి పోటీల‌కు పిల‌ప్పైన్స్ నుంచి పోటీ ప‌డుతున్న మిషెల్లీ మార్కెజ్ చిన్న నాటి పోటోలు కొన్ని నెట్టింట దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. వాటిలో మిషెల్లీ చాలావ‌ర‌కూ అబ్బాయి పోలీకలు ఉండ‌టంతో ఆమె లింగ‌త్వంపై ఊహాగానాలు అల్లుకున్నాయి. ఆమె గే అంటూ అంత‌ర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. విశ్వ సుంద‌రి పోటీల‌కు మార్కెజ్ అన‌ర్హురాలంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేసారు. తాజాగా ఈ క‌థ‌నాల‌పై మార్కెజ్ స్పందించారు.

`అవును నేను బైసెక్సువ‌ల్. చాలా ఏళ్ల క్రిత‌మే ఈ విష‌యం నాకు తెలిసింది. అన్ని ర‌కాల అందాల‌కు నేను ఆక‌ర్షితురాలిని అవుతా. ఇటీవ‌ల జ‌రిగిన పిల‌ప్పైన్ అందాల పోటీల్లో చెప్పాల‌నుకున్నా. కానీ అది స‌రైన స‌మ‌యం కాద‌ని చెప్ప‌లేదు. అప్పుడా విష‌యం చెబితే అంతా ఆశ్చ‌ర్య‌పోతారు. అందుకే చెప్ప‌లేదు. 12 ఏళ్ల వ‌య‌సులోనే నా ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న‌ది అర్ధ‌మైంది. నా స్నేహితుల‌కు ఈ విష‌యం తెలుసు. బ‌య‌ట ప్ర‌పంచానికి మాత్రం ఇప్పుడే అధికారికంగా ప్ర‌క‌టిస్తున్నా.

ఈ విష‌యాన్ని చెప్పాల‌ని నాకు ఎప్పుడూ అనిపించ‌లేదు. ఎందుకంటే లింగ‌త్వం మాత్ర‌మే గుర్తింపు కాదు. అంత‌కంటే ఎక్కువే సాధించా. అందుకే ఇప్ప‌టికాదా చెప్ప‌లేదు. నాకు ఎల్ జీ బీటీక్యూ క‌మ్యూనిటీలో చాలా మంది స్నేహితులున్నారు. ప్రైడ్ మార్చుల‌కు కూడా వెళ్లాను. నేను ఈ క‌మ్యూనిటీకి చెందిన వ్య‌క్తిగ‌న‌ని గ‌ట్టిగా..గ‌ర్వంగానూ చెబుతున్నాను` అని అన్నారు.

దీంతో అన్నిర‌కాల సందేహాల‌కు మార్కెజ్ పుల్ స్టాప్ పెట్టేసారు. త్వ‌ర‌లో ఎల్ సాల్వడార్ లో జ‌రిగే 72వ మిస్ యూనివ‌ర్స్ పోటీలో మార్కెజ్ పాల్గొంటారు. పిల‌ప్పీన్స్ త‌రుపున‌ ఆమె పోటీ బ‌రిలోకి దిగుతున్నారు. ఎల్ జీ బీ టీ క్యూ క‌మ్యూనిటీకి చెందిన వ్య‌క్తి మిషెల్లీ ఒక్క‌రే కాదు. మాజీ మిస్ అర్జెంటీనా మ‌రియానా వారెల్లా.. మాజీ మిస్ ప్యూర్టోరికా పాబియోలా వాలెంటీనా కూడా అదే క‌మ్యూనిటీకి చెందిన వారు. వాళ్లిద్ద‌రు వివాహం కూడా చేసుకున్నారు.