సుశాంత్ మరణం వెనుక చేతబడి హస్తం?

Tue Aug 04 2020 06:00:11 GMT+0530 (IST)

The hand behind Sushant's death?

బాలీవుడ్ హీరో సుశాంత్ మరణంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. సుశాంత్ ఉరి వేసుకున్న నైట్ గౌన్ కు 80 కేజీల బరువు తట్టుకోగలదా అన్న అనుమానం మొదలు....తాజాగా సుశాంత్ కేసు విచారణకు వచ్చిన బీహార్ పోలీస్ అధికారి పాట్నా సింగం వినయ్ తివారీని కరోనా పేరుతో క్వారంటైన్ చేయడం వరకు....ఎన్నో విషయాలపై మీడియా సోషల్ మీడియాలో తీవ్రస్థాయి చర్చ జరుగుతోంది. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్ పెరుతున్న నేపథ్యంలో సుశాంత్ మేనేజర్ గా పనిచేిన దిశ సలియాన్ ఆత్మహత్య కేసునూ సీబీఐకి అప్పగించాలని దిశ తల్లి డిమాండ్ చేశారు. మరోవైపు సుశాంత్ మరణం వెనుక చేతబడి జరిగిందన్న ఆరోపణలు సోషల్ మీడియాలో మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఆ పుకార్లకు బలం చేకూర్చేలా సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి భారీ మొత్తంలో నగదు బదిలీ అయ్యాయని తనిఖీల్లో వెల్లడి కావడం సంచలనం రేపుతోంది.
తన కుమారుడి బ్యాంక్ అకౌంట్‌ను భారీగా దుర్వినియోగం చేశారని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్ పట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్ అకౌంట్ నుంచి రూ.15 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని ఓ సీక్రెట్ అకౌంట్ కు రియానే ఆ డబ్బు మరలించిందని ఆరోపించారు. అంతేకాకుండా పూజల పేరుతో రూ.3 లక్షలకుపైగా ఖర్చు చేసినట్టు బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయని కేకే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోల్గ్ ఫిరోజ్ ఆహ్మద్ షేక్ అనే వ్యాపారికి 5 లక్షలకు పైగా ట్రాన్స్‌ఫర్ చేసినట్టు తనిఖీల్లో వెల్లడైంది. ఒక నెలలోనే పూజ కోసం ఇంత మొత్తం ఖర్చు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019 జూలై 14వ తేదీన ముంబైలోని ఓ హోటల్‌లో రూ.62179 రూ. 45 వేల రూపాయలను పూజ సామాగ్రికి ఖర్చు చేశారని తేలింది. 2019 జూలై 22న 55 వేలు 36 వేలు...ఆగస్టు 2 2019న 86 వేల రూపాయలు ఆగస్టు 8వ తేదీన 11 వేలు 2019 ఆగస్టు 9వ తేదీన శృతి మోడీ అనే అకౌంట్‌కు 63 వేల రూపాయలు ఆగస్గు 15 2009న 60 వేల రూపాయలు పూజ కోసం ఖర్చు చేయడం వెనుక ఏదో మర్మముందని ఆరోపణలు వస్తున్నాయి.

అయితే తన పాత ఇంటిలో ప్రేతాత్మలు తిరుగుతున్నాయనే భయంతో సుశాంత్ ఇల్లు మారాడన్న వాదన ఉంది. ఆ ఇల్లు మారదామని సుశాంత్ ను రియానే ప్రేరేపించిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత ఆ ఇంటి నుంచి రియా చక్రవర్తి ఇంట్లో కొన్నాళ్లు సుశాంత్ ఉన్నాడని ఆ తర్వాత రూ.4లక్షలు అద్దె చెల్లిస్తూ సూసైడ్ చేసుకున్న ఇంటికి మారాడని అంటున్నారు. అయితే ఇంత పెద్దమొత్తంలో పూజల కోసం డబ్బు ఎందుకు ఖర్చు చేయాల్సి వచ్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సుశాంత్ సింగ్‌పై చేతబడి జరిగిందా అనే విషయంపై సోషల్ మీడియాలో ఆరోపణలే తప్ప ఎక్కడా ఆధారాలు లేవు.