ఫోటో స్టొరీ: ఛార్మి ఈజ్ బ్యాక్

Tue Nov 19 2019 14:14:39 GMT+0530 (IST)

Charmi Glamourous pose in Goa

సీనియర్ హీరోయిన్ ఛార్మి గురించి కొత్తగా ఇంట్రో ఇవ్వాల్సిన పనే లేదు. 50 కి పైగా సినిమాల్లో నటించిన ఛార్మి ఖాతాలో ఎన్నో హిట్లు ఉన్నాయి.  అయితే ఈమధ్య నటనకు దూరంగా ఉంటూ పూరి కనెక్ట్స్ బ్యానర్లో నిర్మాణ బాధ్యతలు చూస్తోంది. 'ఇస్మార్ట్ శంకర్' సూపర్ హిట్ కావడంతో డైరెక్టర్ గా పూరి జగన్నాధ్ తన కెరీర్లో బౌన్స్ బ్యాక్ అయ్యాడనే సంగతి తెలిసిందే.  ఇక నిర్మాతగా కూడా ఛార్మికి మంచి పేరు వచ్చింది.ఇదిలా ఉంటే ఛార్మి ప్రస్తుతం 'రొమాంటిక్' సినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. అనిల్ పాడూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పూరి-ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆకాష్ పూరి.. కేతిక శర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది.   దీంతో షూటింగ్ గ్యాప్ లో బీచులలో ఎంజాయ్ చేస్తోంది.  ఆలా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా ఛార్మి అభిమానులతో పంచుకుంది.  

రెండు ఫోటోలు పోస్ట్ చేసి "నువ్వు అలలను ఆపలేవు.. అయితే సర్ఫింగ్ చేయడం నేర్చుకోగలవు. #రొమాంటిక్ #గోవా #షూట్ మోడ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈమధ్య ఛార్మి ఫిట్నెస్ పై గట్టిగా ఫోకస్ చేసిందేమో కానీ ఈ ఫోటోలలో స్లిమ్ గా ఫిట్ గా కనిపిస్తోంది.  బ్లాక్ టీ షర్టు.. ప్యాంట్ ధరించి పర్ఫెక్ట్ షేప్ లో కనిపిస్తోంది.  మరో ఫోటోలో సూపర్ గా నవ్వుతూ పోజిచ్చింది.  ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. "ఛార్మి ఈజ్ బ్యాక్".. "నువ్వు ఎందుకు అంత అందంగా ఉన్నావు?".. "హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నావా?" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు.