Begin typing your search above and press return to search.

పాపం చార్మీ.. ఈ రియాక్షన్ ఊహించి ఉండదు..!

By:  Tupaki Desk   |   30 May 2023 9:00 PM GMT
పాపం చార్మీ.. ఈ రియాక్షన్ ఊహించి ఉండదు..!
X
పంజాబీ బ్యూటీ చార్మీ ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. దాదాపు స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడింది. ఆమె కెరీర్ లో చాలా మంచి సినిమాలే ఉన్నాయి. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత ఆమె పూరీ జగన్నాథ్ తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.

ప్రొడ్యూసర్ గా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ కొట్టిన చార్మి, ఆ తర్వాత ఎన్నో ఆశలుపెట్టుకొని తీసిన లైగర్ సినిమా మాత్రం దెబ్బేసింది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలని భారీ బడ్జెట్ పెట్టారు.

కానీ సినిమా కొంచెం కూడా ఆకట్టుుకోకపోవడంతో నిరాశ తప్పలేదు. ఈ మూవీ విషయంలో డిస్ట్రిబ్యూటర్లు విపరీతంగా నష్టపోగా పంపిణీదారుల నుంచి ప్రతికూలత ఎదురైంది. ఈ విషయంలో చార్మీకి ట్రోల్స్ కూడా తప్పలేదు.

కాగా, తాజాగా సోషల్ మీడియాలో చార్మీకి మరోసారి ప్రతికూలత ఎదురైంది. చార్మీ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు, తనకు నచ్చిన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు.

తాను పెంచుకుంటున్న కుక్క ఫోటోలను కూడా ఆమె షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె తన కుక్కతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేయగా, ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది.

కుక్కతో ఫోటో దిగినందుకు కాదు, ఆ ఫోటో లో ఉన్న టేబుల్ మీద విస్కీ తాగే లాంటి గ్లాస్ కూడా ఉంది .అది వాటర్ గ్లాస్ కూడా అయ్యి ఉండచ్చు ట్రోల్ చెయ్యడానికి ఏమి దొరుకుతుందా అనే బ్యాచ్ కి ఆ వాటర్ గ్లాస్ విస్కీ గ్లాస్ ల కనిపించింది . ఇంకేముంది ఆమెను విపరీతంగా విమర్శించడం మొదలుపెట్టారు.

ఉదయాన్నే మందు తాగతావా అంటూ చార్మీని ట్రోల్ చేస్తున్నారు. అయితే కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తారు. అది ఆల్కహాల్ అయి ఉంటుందని గ్యారెంటీ ఏంటి? జ్యస్ అయ్యి ఉండొచ్చు కదా అని సపోర్ట్ చేస్తున్నారు. కానీ, తాను కాజువల్ పోస్టు చేసిన ఈ ఫోటోల నుంచి ఆమె ఇలాంటి నెగిటివిటీని ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు. మరి ఈ ట్రోల్స్ పై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.