మైక్ టైసన్ తో ఛార్మి స్నేహం?

Sun Jul 03 2022 08:54:49 GMT+0530 (India Standard Time)

Charmee Kaur On Instagram

నటి ఛార్మి ఇటీవల పాన్ ఇండియా నిర్మాతగా ప్రమోటవుతున్న సంగతి తెలిసినదే. సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మాతగా మెహబూబా చిత్రం నిర్మించింది. ఆ తర్వాత `ఇస్మార్ట్ శంకర్`తో తన సక్సెస్ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ఈ మూవీతో పూరీ- ఛార్మి ద్వయం బ్లాక్ బస్టర్ హిట్ ని దక్కించుకుని మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎనర్జిటిక్ రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత దేవరకొండతో లైగర్ చిత్రాన్ని ప్రారంభించారు పూరి- ఛార్మి జోడీ.పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే నాయికగా నటిస్తోంది. పూరి - ఛార్మితో కరణ్ నిర్మాణ భాగస్వామిగా చేరగా.. ఈ మూవీకి పాన్ ఇండియా అప్పీల్ వచ్చింది. ఇక మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాక్సింగ్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ నటించిన సంగతి తెలిసిందే. మైఖేల్ జాక్సన్ పాత్ర ఇందులో ఆద్యంతం ఆసక్తిని కలిగించనుందిట.

ఇంతకుముందే దేవరకొండ- మైఖేల్ జాక్సన్ నడుమ సన్నివేశాలను చిత్రీకరించారు. అప్పటి ఆన్ లొకేషన్ స్టిల్ ని తాజాగా ఛార్మి షేర్ చేసింది. లొకేషన్ లో లెజెండరీ బాక్సింగ్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ అలా చైర్ పై కూచుని కనిపిస్తుండగా తన చెంతే కూచున్న ఛార్మి నవ్వులు చిందిస్తోంది.

మైక్ ఇది మీకు తెలీదు. మా అత్యంత విలువైన సినిమా LEGEND లో నటింపజేసేందుకు మిమ్మల్ని ఒప్పించాలని కలగన్నాము. అంతిమంగా మీతో కలిసి పని చేసే అవకాశం కలిగింది. మీలాంటి లెజెండ్ తో కలిసి పని చేసే అదృష్టం అవకాశం మాకు కలిగినందుకు సంతోషంగా ఉంది.. అంటూ ఛార్మి ఇన్ స్టాలో వ్యాఖ్యానించారు. లవ్ యు మైక్ టైసన్! అంటూ చివరిగా తన ప్రేమను కురిపించారు.