నెపొటిజం పై చరణ్.. ఆ మాట గుర్తుపెట్టుకుంటా..!

Sat Mar 18 2023 12:21:00 GMT+0530 (India Standard Time)

Charan participated in the India Today conclave spoke about nepotism

ఏ ఇండస్ట్రీలో అయినా వారసత్వం కొనసాగించడం షరా మామూలే. అయితే సినీ పరిశ్రమ విషయానికి వస్తే దాన్ని నెపొటిజం అంటూ కొత్తగా చెబుతుంటారు. మన దగ్గర ఎలా ఉన్నా బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం నెపొటిజం అనేది హాట్ టాపిక్ గా మారింది. అక్కడ నెపొటిజం వల్లే ఎంతోమంది ప్రతిభ గల వారు వెనుక పడుతున్నారు.. కెరీర్ నాశనం చేస్తున్నారు అంటూ టాక్ ఉంది. అయితే ఈ విషయంపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు. లేటెస్ట్ గా నెపొటిజం పై మెగా వారసుడు రామ్ చరణ్ కూడా తన మార్క్ కామెంట్స్ చేశారు.



ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్ క్లేవ్ లో పాల్గొన్న చరణ్ నెపొటిజం గురించి మాట్లాడారు. స్టార్ హీరో కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చినా సరే టాలెంట్ లేకపోతే ఇక్కడ నెట్టుకు రావడం కష్టమని అన్నారు చరణ్. ప్రతిభ ఉంటేనే ప్రేక్షకులు కూడా ప్రోత్సహిస్తారని చెప్పుకొచ్చారు. నెపొటిజం అన్నది నాకు అసలు అర్థం కావట్లేదు. ఈమధ్య ఎక్కువగా దీని గురించి మాట్లాడుతున్నారు.. అయితే నెపొటిజం ఉందని భావించే వారి వల్లే ఈ డిస్కషన్స్ వస్తున్నాయని అన్నారు చరణ్.  

తన విషయానికి వస్తే చిన్ననాటి నుంచి తాను కూడా పరిశ్రమలో ఉన్నాను.. సినిమానే ఊపిరిగా తీసుకుంటూ ఎంతోమంది నిర్మాతలతో కలిసి సినిమాలు చేస్తున్నా.. మనసుకి నచ్చిన పని చేస్తున్నా కాబట్టే 14 ఏళ్లుగా ఇక్కడ ఉన్నానని అన్నారు. తన తండ్రి వల్లే పరిశ్రమలోకి వచ్చినా తనకు తానుగా ఈ ప్రయాణం ముందుకు సాగిస్తున్నానని అన్నారు. టాలెంట్ లేకపోతే ఇదంత తేలికైన విషయం కాదు.

సినిమాల్లోకి అడుగు పెట్టే టైం లో తన తండ్రి ఒక మాట చెప్పారు. సక్సెస్ లేదా ఫెయిల్యూర్ నీ కోసం పనిచేస్తున్న వాళ్లను జాగ్రత్తగా చూసుకో అన్నారు.. ఆ మాటని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా అని అన్నారు చరణ్. ఈ మీటింగ్ లో జరిగిన ఇంటర్వ్యూలో తనకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే ఇష్టమని చెప్పారు. స్పోర్ట్స్ డ్రామా సినిమా చేయాలని ఉందని కొహ్లీ బయోపిక్ లో అవకాశం వస్తే చేస్తానని అన్నారు చరణ్.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.