Begin typing your search above and press return to search.
చరణ్.. ఎన్టీఆర్ ల్లో ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసేది ఎవరు?
By: Tupaki Desk | 25 March 2023 8:00 AMటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఏ హీరో అయినా కొన్నాళ్ల పాటు కెరీర్ పరంగా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ విషయం ఇప్పటికే పలువురు హీరోల విషయంలో నిరూపితం అయ్యింది. రామ్ చరణ్ మగధీర మొదలుకుని మొన్నటి బాహుబలి ప్రభాస్ వరకు కూడా సీన్ రిపీట్ అవుతూనే ఉంది. రాజమౌళి తో సినిమా చేయాలని ఒక వైపు కోరుకుంటూనే ఆ తర్వాత కెరీర్ ఏంటి అనేది హీరోలు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంటారు.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో హీరోలుగా నటించిన రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఇద్దరు కూడా ప్రస్తుతం తమ తదుపరి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో సినిమాను షురూ చేయడం జరిగింది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఇటీవలే సినిమాను మొదలు పెట్టాడు. ఇద్దరిలో జక్కన్న బ్యాడ్ సెంటిమెంట్ ను ఎవరు బ్రేక్ చేస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా యొక్క సక్సెస్ కి కారణం మా హీరో అంటే మా హీరో అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ విషయమై చాలా పెద్ద చర్చే పెట్టారు. ఆ విషయం ఇద్దరు హీరోల తదుపరి సినిమాలు వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జక్కన్న సినిమా తో ఇద్దరు హీరోలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు దక్కించుకున్నారు. వారు తమ తదుపరి సినిమాలతో ఆ ఇమేజ్ ను కాపాడుకోవాల్సి ఉంది. ఇద్దరిలో ఏ హీరో తమ స్థాయిని కాపాడుకోవడంతో పాటు పెంచుకుంటారు అనేది చూడాలి.
ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు చేస్తున్న సినిమాల్లో ఏది సూపర్ హిట్ అయి వసూళ్ల విషయంలో మళ్లీ రికార్డు సృష్టిస్తుందో ఆ హీరో రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసినట్లుగా భావించవచ్చు.
ఇద్దరు హీరోలు కూడా జక్కన్న బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన గొప్ప విషయమే. ఆ విషయాలపై క్లారిటీ రావాలంటే వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే. కొద్ది తేడాతో ఈ ఇద్దరు స్టార్ హీరోలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కనుక ఎవరి స్టామినా ఎంత అనేది తేలిపోనుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.