చరణ్ ఆ రేంజ్.. కానీ తారక్ ఇలా..

Sun Mar 19 2023 13:00:01 GMT+0530 (India Standard Time)

Charan is that range.. but Tarak is like this..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికి ఆస్కార్ సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు. తాజాగా ఢిల్లీ వెళ్లి అక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్ షాని ప్రత్యేకంగా కలవడం జరిగింది. అమిత్ షా చేతుల మీదుగా సన్మానం అందుకున్నారు. ఇక ఇండియా టుడే లాంటి నేషనల్ చానల్ లో రాజ్ దీప్ సర్దేశాయ్ లాంటి టాప్ జర్నలిస్ట్ రామ్ చరణ్ ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. నేషనల్ వైడ్ గా తన బ్రాండ్ ని రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ ని ఉపయోగించుకొని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు.ఇది కచ్చితంగా చెర్రి నెక్స్ట్ సినిమాలకి ఉపయోగపడుతుంది అని చెప్పాలి. అయితే చరణ్ గ్లోబల్ ప్రమోషన్ కి కారణం మాత్రం అతని వెనకే ఉంటున్న భార్య అని చెప్పాలి. ఆమెకున్న హై లెవల్ నెట్ వర్క్ కి చరణ్ ని స్ట్రాంగ్ గా ప్రమోట్ చేయడం కోసం ఉపయోగిస్తుంది. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్ కూడా ఉండటంతో చరణ్ కి నేషనల్ లెవల్ లో మంచి రెస్పెక్ట్ అలాగే కావాల్సినంత ప్రచారం లభిస్తుంది. అటు అపోలో ఫ్యామిలీ ఇటు మెగాస్టార్ కి కేంద్రంలో బీజేపీతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక మెగా పీఆర్ టీమ్ కూడా చరణ్ ని ప్రమోట్ చేయడంలో బలంగా పని చేస్తుంది.

అయితే తారక్ కి నేషనల్ లెవల్ లో ఆశించిన స్థాయిలో ప్రమోషన్ రావడం లేదు. చరణ్ కి నేషనల్ మీడియా ఇచ్చినంత ఫోకస్ జూనియర్ ఎన్టీఆర్ కి ఇవ్వడం లేదనే అసంతృప్తి జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో కూడా ఉంది. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియాలో కూడా ప్రస్తావిస్తున్నారు. దీనికి కారణం కూడా ఉందని చెప్పాలి. హీరోగా కెరియర్ ప్రారంభించినప్పటి నుంచి తారక్ కి ఫ్యామిలీ సపోర్ట్ పెద్దగా లేదనే చెప్పాలి.

జూనియర్ ఎన్టీఆర్ కి నందమూరి ఫ్యామిలీ బ్రాండ్ ఇమేజ్ ఉన్న కూడా అది అతనికి నేషనల్ లెవల్ ఇమేజ్ తీసుకురావడానికి ఉపయోగపడటం లేదు. అలాగే  తారక్ కి ప్రత్యేకంగా పీఆర్ టీమ్ అంటూ ఏమీ లేదు. అలాగే టీడీపీ పార్టీ నుంచి కూడా తారక్ కి పొలిటికల్ సపోర్ట్ పెద్దగా లేదని చెప్పాలి. దీంతో తారక్ సింగిల్ గా తన చరిష్మాతోనే తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే రామ్ చరణ్ కి నేషనల్ లెవల్ లో లభిస్తున్నంత పాపులారిటీ తారక్ కి లభించడం లేదు అనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.