Begin typing your search above and press return to search.

వీరయ్య విజయ విహారంలో చరణ్!

By:  Tupaki Desk   |   27 Jan 2023 3:35 PM GMT
వీరయ్య విజయ విహారంలో చరణ్!
X
మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కంటే ముందు బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో ముందుకు వచ్చాడు. ఒక రోజు తేడాతో వచ్చిన వీరయ్య.. బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కలెక్షన్‌ల సునామీ కురిపిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా 200 కోట్ల క్లబ్‌ లో చేరిపోయింది. ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ కూడా అందించబోతోందని టాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా శృతి హాసన్ నటించింది. రవితేజ కూడా కీలక పాత్ర పోషించడంతో.. ఈ సినిమాకు కలెక్షన్ల పరంగా ప్లస్ అయిందనే చెప్పవచ్చు. దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందించగా... మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన విజయోత్సవ సభను కూడా నిర్వహించాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. వీరయ్య విజయ విహారం అనే టైటిల్ తో ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ను తెలంగాణలో నిర్వహించనున్నారు. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ యూనివర్సిటీలో గ్రాండ్ గా సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించడానికి వేదికను సిద్ధం చేశారు.

ఈనెల 28వ తేదీన ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగబోతోందని ప్రకటించారు. రెండు రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో అభిమానులు ఈ వేడుకకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వేడుక కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వేడుకకు ఆర్ఆర్ఆర్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వేడుకకు రామ్ చరణ్ హాజరైతే.. అటు చరణ్ అభిమానులు, ఇటు మెగాస్టార్ అభిమానులకు పునాకాలు రావడం ఖాయం.

మరోవైపు పవన్ కూడా వస్తారు అనే టాక్ వినిపిస్తుంది. ఎవరు వచ్చినా... వేడుక మరో లెవెల్‌ లో ఉంటుందని అర్థం అవుతోంది. ఇటీవల వీరసింహారెడ్డి సక్సెస్ సెలబ్రెషన్స్ జరుపుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీరయ్య సెలబ్రెషన్స్ మొదలు కానున్నాయి. చూడాలి ఎవరు వీరయ్య సెలబ్రెషన్స్‌ కు హాజరుకానున్నారో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.