క్లిక్ క్లిక్ : ఈ స్టార్ మమ్మీ ఎవరో గుర్తు పట్టారా

Thu Dec 01 2022 16:05:00 GMT+0530 (India Standard Time)

Character Artist Seetha Photo Talk

ఈ ఫొటోలో చూస్తున్న వ్యక్తిని మీరు గతంలో చాలా సినిమాల్లో చూశారు. వేరే భాష సినిమా కూడా కాదు.. మన తెలుగు భాష యొక్క సినిమాల్లో.. అదీ కాకుండా చిన్న సినిమాల్లో కాదు పెద్ద సినిమాల్లో ఈమెను చూశారు. స్టార్ హీరోల సినిమాల్లో హీరోలకు అమ్మగా లేదా హీరోయిన్ కు అమ్మ గా నటించిన ఈమెను గుర్తు పట్టడం కాస్త కష్టంగానే ఉండి ఉంటుంది.ఎక్కడో చూసినట్లు ఉంది కానీ గుర్తు రావడం లేదని మీరు అనుకుంటూ ఉంటారు.. ఈమె ను కొందరు అయినా గుర్తు పట్టే ఉంటారు. ఈమె ఎవరు అంటే సీనియర్ నటి సీత. ఔను గంగోత్రి.. సింహాద్రి.. ప్రాణం... బన్నీ ఇంకా చాలా సినిమాల్లో అమ్మ పాత్ర ను చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టు సీత.

సినిమాల్లో చాలా హుందాగా పద్దతైన కట్టు బొట్టు లో కనిపించిన సీత ఇలా మేకప్ తో పది ఇరవై సంవత్సరాల వయసు తగ్గడం తో గుర్తించడం కాస్త కష్టంగానే ఉంది. పేరు చెప్పిన తర్వాత ఔను నిజమే కదా అని మీరు అనుకుంటున్నారు కదా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీత ఫొటోలు ఇవి.

1980 ల్లో సినీ రంగ ప్రవేశం చేసి 55 ఏళ్ల వయసులో కూడా బిజీ గా ఉన్న సీత నటన విషయంలో పలు సార్లు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న విషయం తెల్సిందే. నటిగా సీత ఎన్నో సార్లు అలరించింది.. ఆశ్చర్యపర్చింది. అయితే మొదటి సారి ఇలా తన లుక్ తో సీత సర్ ప్రైజ్ చేశారు అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.