14 ఏళ్ల తర్వాత ఛాన్స్.. త్రిష టైమ్ నడుస్తుందంతే..!

Tue Dec 06 2022 12:40:53 GMT+0530 (India Standard Time)

Chance after 14 years.. Trisha With Vijay

చెన్నై చిన్నది త్రిష కృష్ణన్ నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ మూవీ నుంచి ఇప్పటి వరకు ప్రేక్షకుల మనసు డిస్టర్బ్ చేస్తూనే వస్తుంది. కెరీర్ లో పీక్స్ కి వెళ్లిన త్రిష ఆ స్టార్ ఇమేజ్ ని అలాగే కొనసాగిస్తూ వచ్చింది. మధ్యలో కొంత కెరీర్ డౌన్ అయినట్టు అనిపించినా మళ్లీ పుంజుకుంది. 96 మూవీతో మరోసారి తన సత్తా చాటిన త్రిష ఆ మూవీ హిట్ ఇచ్చిన జోష్ తో కెరీర్ ఊపందుకుంది. అలాగే ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ వస్తుంది.తెలుగులో పెద్దగా ఛాన్సులు లేకపోయినా తమిళంలో మాత్రం త్రిష తన సత్తా చాటుతోంది. ఇటీవల వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 1 (PS1) మూవీలో కూడా త్రిష అదరగొట్టేసింది. ఆ మూవీలో ఐశ్వర్య రాయ్ ని కూడా బీట్ చేసి త్రిష అందంగా కనిపించింది. ఈమధ్య త్రిష మరింత మెరిసిపోతుంది.

అమ్మడి గ్లామర్ రహస్యం ఏమిటో కానీ ఆ క్రేజ్ తోనే వరుస అవకాశాలు అందుకుంటుంది. పి.ఎస్ 1 తో స్పెషల్ డిస్కషన్స్ లో ఉన్న త్రిష లేటెస్ట్ గా దళపతి విజయ్ సినిమాలో ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తుంది.    

విజయ్ 67వ సినిమా గా వస్తున్న ఈ మూవీని కోలీవుడ్ టాలెంటెడ్ డైరక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషని ఫిక్స్ చేశారు. విక్రం తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ విజయ్ తో చేస్తున్న సినిమాని కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేశారు.

ఈ మూవీలో త్రిష ఛాన్స్ అందుకోవడం ఆమెకు మరింత బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. విజయ్ తో త్రిష 14 ఏళ్ల క్రితం గిల్లి మూవీలో నటించింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మరోసారి ఇద్దరు కలిసి జోడీ కడుతున్నారు. పాన్ ఇండియా లెవల్లో రాబోతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా సెలెక్ట్ అవడం లక్కీ అని చెప్పొచ్చు.  

రెండు దశాబ్ధాలుగా కెరీర్ కొనసాగిస్తూ తన నటనతో ఆడియన్స్ ని మెప్పిస్తూ వస్తున్న త్రిష ఇప్పటికీ పాన్ ఇండియా సినిమా ఛాన్స్ లు అందుకుంటుంది అంటే అమ్మడి దూకుడు ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. త్రిష ఇదే ఫాం కొనసాగిస్తే మరో పదేళ్లు కూడా సినిమాలు తీసేలా ఉంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.