నాగచైతన్య తో విడాకుల ప్రకటన అనంతరం సమంత దూకుడు తెలిసిందే. ఓవైపు విహారయాత్రలతో మైండ్ ని రీఫ్రెష్ చేస్తున్న సామ్ మరోవైపు వరుస ప్రాజెక్టులకు కమిటవుతూ కెరీర్ పరంగా డోఖా లేకుండా జాగ్రత్త పడుతోంది. తెలుగు-తమిళంలో ఇటీవల రెండు ప్రాజెక్టుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తదుపరి వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని తెలిసింది. అమెజాన్ ప్రైమ్ - రాజ్ అండ్ డీకేతో ఓ వెబ్ సిరీస్ కి సన్నాహకాల్లో ఉన్నారు సామ్.
అయితే సమంతకు ధీటుగా
నాగచైతన్య కూడా బరిలో దిగుతున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. చైతూ
వరుసగా సినిమాల్ని ప్రకటించనున్నారని అలాగే వెబ్ సిరీస్ లోనూ
నటిస్తారని తెలిసింది. థ్యాంక్యూ షూటింగ్ దాదాపు పూర్తి చేసాడు. క్యూలో
బంగార్రాజు.. ఓ వెబ్ సిరీస్ ఉన్నాయి. చై నటిస్తున్న బాలీవుడ్ తొలి చిత్రం
లాల్ సింగ్ చద్దా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈలోగానే మరిన్ని
ప్రకటనలు చేయడానికి సిద్ధమవుతున్నాడని కొంత సమయం పడుతుందని
తెలిసింది. తొలిగా వైజయంతీ మూవీస్ బ్యానర్ లో దర్శకురాలు నందిని రెడ్డితో
మూవీ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. చర్చల దశలో మరో రెండు ప్రాజెక్టులు
ఉన్నాయి. వాటిలో ఒకటి సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తరుణ్ భాస్కర్ తో
ఉంటుందని తెలిసింది. కథా చర్చలు పూర్తి చేసాక ప్రకటనలు
వెలువడేందుకు ఆస్కారం ఉంది.
ఇక సమంత ప్రస్తుతం కశ్మీర్
పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన స్నేహితురాలు శిల్పారెడ్డితో
కలిసి హిమానీ పర్వతాల్లో సేదదీరుతుంటే చైతన్య మాత్రం ఎందుకనో సైలెంట్
గా ఉన్నాడు. అతడికి సంబంధించిన ఏ విషయమూ బయటకు తెలియడం లేదు.