మహేష్ బర్త్ డే నాడు వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఫ్యాన్స్...!

Sun Aug 09 2020 19:00:47 GMT+0530 (IST)

Celebs Birthday Wishes to Mahesh babu

టాలీవుడ్ లో తనకు సరిలేరు ఇంకెవ్వరూ అన్నట్లుగా కెరీర్ కొనసాగిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. విలక్షణ కథలు ఎంచుకుంటూ విభిన్నమైన పాత్రల్లో కనిపించడం తనకు మాత్రమే సాధ్యం అనే రీతిలో దూసుకుపోతున్న మహేష్ బాబు పుట్టినరోజు నేడు. ఆయన అభిమానులు మహేష్ బర్త్ డే విషయం ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అయ్యేలా చేసారు. ఈ క్రమంలో మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొత్త రికార్డులు సృష్టించి తమ హీరో మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యధిక ట్వీట్స్ తో గిన్నిస్ రికార్డ్స్ టార్గెట్ పెట్టుకున్న మహేష్ ఫ్యాన్స్ ఆ ఫీట్ ని సాధించారు. #HBDMaheshBabu హ్యాష్ ట్యాగ్ తో 24 గంటల్లో 60.2 మిలియన్ ట్వీట్స్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసి సత్తా చాటారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఇప్పటికే మహేష్ బర్త్ డే కామన్ డీపీతో ట్విట్టర్ లో రికార్డ్స్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక మహేష్ బర్త్ డే సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు శ్రేయోభిలాషులు స్నేహితులు అభిమానులు అందరూ ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు.ఈ నేపథ్యంలో మహేష్ బాబు పట్ల సోదర భావంతో మెలిగే మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ''హ్యాపీ బర్త్ డే మహేశ్ అన్న.. ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను'' అని ఎన్టీఆర్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి కూడా మహేశ్ బాబుకు ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలియజేసారు. ''అందం అభినయం భగవంతుడు మీకిచ్చిన వరం. మరెన్నో  మరిచిపోలేని పాత్రలు చేయాలనీ మీ  కలలన్ని నెరవేరాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే మహేష్. ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను'' అని ట్వీట్ చేశారు చిరంజీవి. విక్టరీ వెంకటేష్ ట్వీట్ చేస్తూ.. ''నా ప్రియ సోదరుడు మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీకు మున్ముందు మరిన్ని విజయాలు చేకూరాలి'' అని పేర్కొన్నారు.

కాగా డైరెక్టర్ హరీష్ శంకర్ ఆకక్తికరమైన ట్వీట్ పెట్టి మహేష్ బాబు పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. 'పోకిరి' సినిమాలోని 'దేవ దేవుడా..' సాంగ్ లోని మహేష్ బాబు నడుచుకుంటూ వచ్చే వీడియో క్లిప్ షేర్ చేసి మహేష్ బాబు సీన్స్ లో ఇది నా ఆల్ టైం ఫెవరెట్స్ లో ఒకటి. నేను ఎల్లప్పుడూ సూపర్ స్టార్ ని ఇలానే ఉండాలి అనుకుంటాను'' అని ట్వీట్ చేసారు. ఇక మహేష్ బాబుకి మంచు మనోజ్ - మంచు విష్ణు - అల్లరి నరేష్ - కియారా అద్వాణీ - సంపత్ నంది - ఎస్ జే సూర్య - సునీల్ - డేవిడ్ వార్నర్ - అనిల్ సుంకర్ - తమన్నా - తమన్ - దేవిశ్రీ ప్రసాద్ - హరీష్ శంకర్ - శ్రీను వైట్ల - శ్రీరామ్ ఆదిత్య - సుధీర్ బాబు - విజయ శాంతి - మోహన్ లాల్ - భరత్ - రోజా - రాధిక - ఊర్వశీ రౌటేలా - అశోక్ గల్లా - సుధీర్ వర్మ - కార్తికేయ - మెహర్ రమేష్ - అనిల్ రావిపూడి - కళైపులి ఎస్ థాను - నభా నటేష్ - రాశీ ఖన్నా - రకుల్ ప్రీత్ - శృతీ హాసన్ - కాజల్ అగర్వాల్ - తరుణ్ భాస్కర్ - రాఘవేంద్ర రావు - లావణ్య త్రిపాఠి - సునీల్ శెట్టి - ప్రగ్యా జైస్వాల్ - మీరాచోప్రాలు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేసారు.