సోషల్ మీడియా ఫాలోవర్లను స్టేటస్ సింబల్ గా భావిస్తున్న సెలబ్రిటీలు..!

Wed Jan 19 2022 17:10:58 GMT+0530 (India Standard Time)

Celebrities who consider social media followers as a status symbol

ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. సెలబ్రిటీలకు వాళ్ళను అనుసరించేవారికి సోషల్ మీడియా మాధ్యమాలు అనుసంధానాలుగా మారాయి. సినీ ప్రముఖులు మూవీ ప్రమోషన్స్ మొదలుకొని తమ వ్యక్తిగత విషయాల వరకు అన్నీ ఈ మీడియం ద్వారానే అభిమానులకు చేరవేస్తుంటారు.ఈ క్రమంలో ఫాలోవర్స్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. అలానే పలు కమర్షియల్ బ్రాండ్స్ కు పెయిడ్ ప్రమోషన్స్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పుడు హీరోహీరోయిన్ల స్టార్డమ్ - ఇమేజ్ లను లెక్కగట్టడంలో కూడక్ సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్యను పరిగణలోకి తీసుకుంటున్నారు.

ఫేస్ బుక్ - ట్విట్టర్ - ఇన్స్టాగ్రామ్ వంటి ఫ్లాట్ ఫార్మ్స్ లో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటే వారికి అంత క్రేజ్ ఉన్నట్లు భావిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా తమ ఫాలోవర్స్ ని తమ ప్రాపర్టీగా భావిస్తూ వారిని పెంచుకునే పనిలో ఉన్నారు. దీని కోసం ప్రత్యేకంగా టీమ్స్ ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సెలబ్రెటీలు తమ సోషల్ మీడియా ఎకౌంట్స్ కి ఫాలోవర్స్ ని పెంచుకోవడం ప్రారంభించాక.. దాన్ని ప్రచారం చేసుకోవడం ఇప్పుడు స్టేటస్ సింబల్ గా అనుకుంటున్నారు. తమకు అన్ని మిలియన్ల ఫాలోవర్స్ అంటూ నెట్టింట హంగామా సృష్టించడం కామన్ అయిపోయింది.

చాలా మంది స్టార్స్ తమ డిజిటల్ టీమ్స్ ద్వారా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ గురించి బాగా ప్రమోట్ చేయించుకుంటున్నారు. దీని కోసం వారు భారీగానే ఖర్చు చేస్తుండటం గమనార్హం. ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో ఇదే  ట్రెండీ టాపిక్ గా నడుస్తోంది.