కమల్ 60 ఇయర్స్ ఫంక్షన్..అతిరథులు హాజరు!

Mon Nov 18 2019 21:57:52 GMT+0530 (IST)

Celebrating Kamal Haasan the legend - 60 years in the Indian Film Industry

సినీ పరిశ్రమలోకి కమల్ హాసన్ ఎంట్రీ ఇచ్చి అరవై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి అతిరథులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఒక చారిటీ షోగా నిర్వహించారు.  కమల్ సొంతూరులో ఒక స్కిల్ సెంటర్ ను నెలకొల్పడానికి  కోటి రూపాయల నిధుల సమీకరణ చేశారు ఈ కార్యక్రమం ద్వారా.ఈ కార్యక్రమానికి తమిళ సినిమా ప్రముఖులంతా దాదాపుగా హాజరయ్యారు. బాలనటుడిగా కమల్ హాసన్ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఏడేళ్ల వయసులో బాలనటుడిగా ఆయన ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డును పొందాడు కమల్. ఆ తర్వాత యుక్త వయసు నుంచి హీరోగా రాణించాడు. ఇలా అరవై ఏడేళ్ల వయసుకు వచ్చే సరికి అరవై యేళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నాడు.

ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. కమల్ తో తన అనుబంధాన్ని ఆయన వివరించారు. ఏఆర్ రెహమాన్ - ఇళయరాజా తదితరులు వేదిక మీద కమల్ తో తాము చేసిన పాటలతో ఉర్రూతలూగించారు.

తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులు విజయ్ సేతుపతి - వడివేలు - ప్రభు - కార్తీ - శివకుమార్ - నాజర్ - శరత్ కుమార్ - సత్యరాజ్ - అంబిక - రాధా తో పాటు హీరోయిన్లు మనీషా కొయిరాలా - తమన్నా - దర్శకులు కేఎస్ రవి కుమార్ - ఎస్పీ ముత్తురామన్ - మణిరత్నం - పా రంజిత్ - శంకర్.. సంగీత దర్శకుడు దేశీ వ్రీ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.