Begin typing your search above and press return to search.

ఇంతకు ఈమె బాలయ్య మూవీలో ఉందా? లేదా?

By:  Tupaki Desk   |   8 Feb 2020 7:50 AM GMT
ఇంతకు ఈమె బాలయ్య మూవీలో ఉందా? లేదా?
X
బాలకృష్ణ.. బోయపాటిల కాంబోలో రూపొందబోతున్న చిత్రంలో ఒక హీరోయిన్‌ గా కేథరిన్‌ నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. భారీ పారితోషికం ఇచ్చి మరీ కేథరిన్‌ ను బాలయ్య సినిమాలో నటింపజేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత మళ్లీ బాలయ్య సినిమాలో కేథరిన్‌ నటించడం లేదు అంటూ వార్తలు వచ్చాయి. మొత్తానికి బాలయ్య.. బోయపాటిల మూవీ హీరోయిన్‌ విషయమై వార్తల మీద వార్తలు వస్తూ జనాలను కన్ఫ్యూజ్‌ చేస్తున్నారు.

తాజాగా కేథరిన్‌ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రం ప్రమోషన్‌ లో భాగంగా మీడియా సమావేశం లో పాల్గొంది. ఆ సందర్బంగా మీరు బాలకృష్ణ సినిమాను ఒప్పుకున్నారా.. నటిస్తున్నారా అంటూ ప్రశ్నించగా ఆమె చిరాకు పడిరదట. ఆ సినిమాలో నేను నటిస్తున్నానా లేదా అనే విషయం బోయపాటి గారిని అడిగితే తెలుస్తుంది. నన్ను పదే పదే ఈ ప్రశ్నతో ఎందుకు విసిగిస్తున్నారు అంటూ చిర్రు బుర్రులాడుతూ అసలు విషయం చెప్పకుండా టాపిక్‌ మార్చింది.

బాలకృష్ణ సినిమాలో నటించకుంటే డైరెక్ట్‌ గా నేను ఆ సినిమాలో నటించడం లేదు.. నన్ను ఎవరు సంప్రదించలేదు అంటూ సమాధానం ఇవ్వొచ్చు. కాని చర్చలు జరుగుతున్నాయి.. ఈమె డిమాండ్‌ కు వారు చర్చిస్తు ఉంటారు. అందుకే ఆమె ఇలాంటి కామెంట్స్‌ చేసి ఉంటుందని కొందరు విశ్లేషిస్తున్నారు. కేథరిన్‌ ను ఎంపిక చేశారా లేదా అనేది బోయపాటి చెప్పాల్సి ఉంది. త్వరలో ఈ మూవీ సెట్స్‌ పైకి వెళ్లబోతుంది. అప్పటి వరకు కేథరిన్‌ ఉందా లేదా అనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.