దళపతి 65 కోసం భామల మధ్య క్యాట్ ఫైట్ షురూ

Sun Feb 28 2021 09:20:54 GMT+0530 (IST)

Cat fight starts between Heroines for Dhalpati 65

కోలీవుడ్ పవర్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానుల్ని సంపాదించుకున్న స్టార్ విజయ్. రజనీకాంత్ తర్వాత మాస్ లో మ్యాసివ్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ గా ఏల్తున్నాడు. ఇలయదళపతి అంటూ కోలీవుడ్ గౌరవిస్తోంది. అంత పెద్ద స్టార్ సరసన ఆఫర్ అంటే ఆషామాషీనా?  పైగా కెరీర్ ల్యాండ్ మార్క్ మూవీగా చెబుతున్న 65వ సినిమాలో ఆఫర్ కోసం భామలు సీరియస్ గా పోటీపడుతున్నారట.ఇటీవల కొంతకాలంగా రష్మిక మందన పేరు ప్రముఖంగా వినిపించింది. విజయ్ సరసన ఆల్మోస్ట్ ఖాయమైపోయినట్టేనని అంతా భావించారు. కానీ ఇంతలోనే రష్మిక ఆఫర్ ని మిస్ చేసుకుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

పాన్ ఇండియా బ్యూటీ పూజా హెగ్డే దాదాపుగా విజయ్ 65 కి ఖాయమైనట్టేనన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ భామ మేకర్స్ తో చర్చలు జరుపుతోందని సమాచారం. ఇప్పటికి ఇంకా సంతకం చేయలేదు. ఒకవేళ ఓకే చేస్తే...పూజాకి ఇది కోలీవుడ్ రీఎంట్రీ మూవీ అవుతుందన్న చర్చా మొదలైంది. జీవా సరసన ములమూడి (2012) చిత్రంతో పూజా కోలీవుడ్ లో అడుగుపెట్టింది. అదే సినిమాని తెలుగులో అనువదించి రిలీజ్ చేశారు. ఆ తర్వాత పూజాకి అక్కడ బిగ్ గ్యాప్ వచ్చింది. ఎట్టకేలకు దళపతి 65 తో కోలీవుడ్ లో పూజా తిరిగి ప్రవేశిస్తోంది.
 
పూజాకి రష్మిక నుంచి కాంపిటీషన్ ఉన్నా.. ఇటీవల బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోవడం మైనస్ గా మారింది. రష్మిక ఇప్పటికే తన తొలి హిందీ చిత్రం `మిషన్ మజ్ను` షూటింగ్ లో బిజీగా ఉంది. కాబట్టి రష్మిక బిజీ షెడ్యూల్ పూజాకు ప్లస్ గా మారింది. దళపతి 65 కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే కథానాయిక ఎవరు అన్నది అధికారికంగా ప్రకటించనున్నారు.