Begin typing your search above and press return to search.

తారక్ మూవీకి హైలైట్ గా కార్గో షిప్ ఫైట్

By:  Tupaki Desk   |   27 March 2023 9:12 AM GMT
తారక్ మూవీకి హైలైట్ గా కార్గో షిప్ ఫైట్
X
కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం తారక్ 30వ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ లో మొదలవుతుంది. ఇక ఈ షూటింగ్ లో భాగం గా ఫస్ట్ షెడ్యూల్ ని యాక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి కే కొరటాల చెప్పిన కథాంశం బట్టి మూవీలో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని క్లారిటీ వచ్చింది.

గూస్ బాంబ్ సీన్స్ మూవీలో చాలా ఉంటాయని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి యాక్షన్ డైరెక్టర్ గా హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్ని బేట్స్ ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇక అతను ఇప్పటికే మూవీ టీమ్ తో జాయిన్ అయ్యి ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా మొదటి షెడ్యూల్ లో సముద్రం లో తారక్ ఎంట్రీ సీన్ తో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించనున్నారు.

ఇక ఈ సీక్వెన్స్ అంతా కూడా కెన్ని బేట్స్ డిజైన్ చేయనున్నాడు. సముద్రంలో కార్గో షిప్ పై ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని తెలుస్తుంది. దీని కోసం ఇప్పటికే సాబు సిరిల్ సగం షిప్ ని డిజైన్ చేశారు. మిగిలిన సగం అంతా కూడా సీజీలో సెట్ చేస్తారు.

ఇక ప్రత్యేకంగా సముద్రంలో షిప్ పై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడానికి కావాల్సిన ఎలివేషన్ పార్ట్ అంతా రెడీ అయినట్లు తెలుస్తుంది. ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్ అయిన తర్వాత టాకీ పార్ట్ మొదలు పెట్టబోతున్నారు.

ఇక ఈ మూవీ షూటింగ్ మెజారిటీ పార్ట్ అంతా హైదరాబాద్, వైజాగ్, గోవాలో చేస్తారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఆమె సెకండ్ షెడ్యూల్ నుంచి మూవీ షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇక యాక్షన్ సీక్వెన్స్ కోసం ఫారిన్ ఫైటర్స్ ని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.