'ఆర్ఆర్ఆర్'కు ఆ రెంటిలో ఒకదానితో పోటీ తప్పదా?

Thu Sep 23 2021 14:00:01 GMT+0530 (India Standard Time)

Cannot RRR compete with one of the two

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నారు. చిత్రీకరణ ముగిసి విడుదలకు సిద్దం అయినా కూడా విడుదల తేదీ విషయంలో మేకర్స్ క్లారిటీ లేకుండా ఉన్నారు. కరోనా కారణంగా పలు రాష్ట్రాల్లో ఇంకా థియేటర్లను ఓపెన్ చేయలేదు. అందుకే సినిమాను పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత మాత్రమే విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ ఏడాది చివరి వరకు దేశంలో పరిస్థితి నార్మల్ అవుతుందని.. అలాగే విదేశాల్లో కూడా తెలుగు సినిమాలకు ఆధరణ మళ్లీ మునుపటి మాదిరిగా ఉంటుంది అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. అందుకే వచ్చే ఏడాది ఆరంభంలో ఆర్ ఆర్ ఆర్ ను విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఒక వేళ సంక్రాంతికి కాకుంటే వచ్చే సమ్మర్ లో ఉగాది కానుకగా అయినా ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ సినిమా సంక్రాంతికి లేదా సమ్మర్ లో విడుదల చేయడం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది.సంక్రాంతికి విడుదల అయితే తమిళ వాలిమై సినిమా తో ఆర్ ఆర్ ఆర్ సినిమా పోటీ తప్పదు అంటున్నారు. తెలుగు ఫిల్మ్ మేకర్స్ జక్కన్న వస్తాను అంటే కాస్త సైడ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాని ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కోసం తమిళ సినిమాల వారు వారి డేట్లను సర్దుబాటు చేసుకునేందుకు ఓకే చెప్తారా అంటే అనుమానమే అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. సరే సమ్మర్ లో విడుదల అయితే పర్వాలేదు అనుకోవడానికి లేదు. తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా తన బెస్ట్ సినిమా తో సమ్మర్ లో వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. రెండు సినిమాలు ఒకే వారంలో అవ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కాస్త అటు ఇటుగా విడుదల అయినా కూడా రెండు సినిమాలు కూడా తమిళ బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశం ఉంటుంది. తమిళులు స్థానిక సినిమాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు కనుక ఎలాంటి అనుమానం లేకుండా ఆర్ ఆర్ ఆర్ సినిమా కు అక్కడ వసూళ్లు తగ్గుతాయి.

సంక్రాంతి లేదా సమ్మర్ లో విడుదల అయినా కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఎక్కడో ఒక చోట పెద్ద సినిమాతో క్లాష్ తప్పదని అంటున్నారు. సినిమా బాగుంటే ఖచ్చితంగా వసూళ్లు భారీగా రావడం ఖాయం. అయినా జక్కన్న సినిమాకు పోటీ ఏంటీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు పోటీ అనేది లేకుండా దూసుకు వెళ్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలుస్తుందని.. బాహుబలి రికార్డులను బ్రేక్ చేసి ముందు ముందు ఆర్ ఆర్ ఆర్ ట్రెండ్ సెట్ చేసే రికార్డులను నమోదు చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. రాజమౌళి ఈ సినిమాను రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ వంటి బిగ్గెస్ట్ స్టార్స్ తో చేయడం జరిగింది. దాంతో ఖచ్చితంగా ఈ సినిమా టాలీవుడ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులను అలరించడం ఖాయం.