Begin typing your search above and press return to search.

థియేట‌ర్ల‌లో టికెట్ల అమ్మ‌కానికి అనుమ‌తికి ర‌ద్దు

By:  Tupaki Desk   |   24 Nov 2021 4:58 AM GMT
థియేట‌ర్ల‌లో టికెట్ల అమ్మ‌కానికి అనుమ‌తికి ర‌ద్దు
X
ఆంధ్రప్రదేశ్(ఏపీ)లోని వైఎస్ జగన్మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానాన్ని తప్పనిసరి చేస్తూ మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ సినిమాస్ (నియంత్రణ-సవరణ) చట్టం 2021 అసెంబ్లీ ద్వారా రూపొందింది. సవరణ ప్రకారం.. ప్రభుత్వ సంస్థ ఆన్ లైన్ బుకింగ్ ప్లాట్ ఫారమ్ ద్వారా టికెట్లు కొనాలి.

థియేట‌ర్ల‌లో టికెటింగ్ కి అనుమ‌తి లేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరపున బిల్లును ప్రవేశపెడుతూ రాష్ట్ర సమాచార ప్రజాసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని బిల్లు లక్ష్యాలను ప్రకటనను చదివి వినిపించారు.

భారతీయ రైల్వే ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ తరహాలో అతుకులు లేని ఆన్ లైన్ మూవీ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొంది.

ప్రతిపాదిత ఆన్ లైన్ మూవీ బుకింగ్ సిస్టమ్ విధానం సౌక‌ర్యంగా ఉంటుంది. ఫోన్ కాల్ చేయడం.. ఇంటర్నెట్ లో సర్ఫింగ్ చేయడం.. SMS పంపడం టిక్కెట్ లను బుక్ చేసుకోవచ్చు. ఇది ప్రజలకు ఇబ్బంది లేకుండా సినిమా టిక్కెట్ ను పొందడానికి .. పొడవైన క్యూలలో నిలబడే సమయాన్ని ఆదా చేయడానికి ఉప‌క‌రిస్తుంది.

ప్రతిపాదిత ఆన్ లైన్ మూవీ బుకింగ్ సిస్టమ్ ట్రాఫిక్ సమస్యలను కాలుష్యాన్ని తగ్గిస్తుంది. బ్లాక్ మార్కెటింగ్ కి చెక్ పెడుతుంది. ప్రతిపాదిత ఆన్ లైన్ బుకింగ్ సిస్టమ్ పన్ను ఎగవేతను అరికడుతుందని గ‌డువు లోగా GST సేవా పన్నులు మొదలైన వాటిని వసూలు చేయడానికి రెవెన్యూ డిపార్ట్ మెంట్ కు వీలు కల్పిస్తుందని ఈ బిల్లు పేర్కొంది.