Begin typing your search above and press return to search.

ఆకుప‌చ్చ గౌనులో బుట్ట‌బొమ్మ అందం చూడ‌త‌ర‌మా?

By:  Tupaki Desk   |   29 Sep 2022 5:30 AM GMT
ఆకుప‌చ్చ గౌనులో బుట్ట‌బొమ్మ అందం చూడ‌త‌ర‌మా?
X
తెలుగు నాట బుట్ట‌బొమ్మ‌గా పాపుల‌రైన పూజా హెగ్డే టాలీవుడ్ బాలీవుడ్ లో క్ష‌ణం తీరిక లేనంత బిజీ షెడ్యూళ్ల‌తో గ‌డుపుతోంది. సినిమాల‌తో పాటు రిబ్బ‌న్ క‌టింగులు.. ఫ్యాష‌న్ ఈవెంట్ల‌తోనూ ఈ భామ ఇత‌ర ఆదాయం ఆర్జిస్తోంది. ముంబై టు హైద‌రాబాద్ నిరంత‌ర ప్ర‌యాణాల‌తో పూజాకి ఊపిరాడ‌ని స‌న్నివేశం ఉంది. ఓ వైపు భారీ పారితోషికం ముక్కు పిండి వ‌సూలు చేస్తున్నా ఈ బ్యూటీ కి అవ‌కాశాలు త‌గ్గ‌డం లేదు.

ఇక పూజా సోష‌ల్ మీడియాల్లోనూ జ‌రంత స్పీడ్ మీద ఉంది. అక్క‌డ కూడా భారీగా వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తో ఆదాయం ఆర్జిస్తోంది. ముఖ్యంగా సామాజిక మాధ్య‌మాల్లో భారీ ఫాలోయింగ్ త‌న‌కు పెద్ద ప్ల‌స్ గా మారుతోంది. ఇటీవ‌ల పూజా వ‌రుస ఫోటోషూట్ల‌తో ఫాలోయింగ్ ని పెంచుకుంటోంది. పూజా హెగ్డే పెద్ద తెర కోసం.. అలాగే క్యాజువ‌ల్ గా వెలుపల కొన్ని ఆకట్టుకునే దుస్తుల ఎంపికలతో ఫ్యాషన్ ప‌రంగా తన స్థాయిని పెంచుకుంది.

తాజాగా పూజా షేర్ చేసిన ఇన్ స్టా వీడియో వైర‌ల్ గా మారింది. బుట్ట‌బొమ్మ ఎంతో అందంగా స్లీవ్ లెస్ గ్రీన్ గౌనులో అంద‌రి దృష్టిని ఆకర్షిస్తున్న వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది. చూడ‌గానే మేక‌ప్ లెస్ లుక్ లో సింపుల్ గా క‌నిపించింది. ఇంత‌కీ ఇది ఎక్క‌డ‌? అంటే హైదరాబాద్ లో జరిగిన ఒక ఈవెంట్ కోసం ఇలా హాజ‌రైంది. పూజా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో సాయంత్రం నుండి కొన్ని స్నీక్ పీక్ లను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అల వైకుంఠ‌పుర‌ములో సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యాక కొన్ని వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్న పూజా మ‌ళ్లీ భారీ సినిమాలతో తిరిగి అభిమానుల ముందుకు పూజా రాబోతోంది. 'కభీ ఈద్ కభీ దీపావళి'గా పాపుల‌రైన‌ సల్మాన్ 'భాయిజాన్‌'లో పూజ క‌థానాయిక‌. రణవీర్ సింగ్ 'సర్కస్‌'లో కూడా కనిపించనుంది. పూజా హెగ్డే ఇటీవల హైదరాబాద్ భాయిజాన్ పాట చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంది. భాయిజాన్ లో సల్మాన్- వెంకటేష్ - రామ్ చరణ్ లతో కలిసి పూజా స్క్రీన్ ని షేర్ చేసుకోవ‌డం ఆస‌క్తిక‌రం. తెలుగులో మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమా లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇది రెండో షెడ్యూల్ కి సిద్ధ‌మ‌వుతోంది. దేవ‌ర‌కొండ‌- పూరీతో 'జ‌న‌గ‌న‌మ‌ణ‌'లోనూ క‌న్ఫామ్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఫోటోషూట్లు ఈవెంట్ల‌లో పూజా హెగ్డే ముఖంపై అందమైన చిరునవ్వు ఎప్పుడూ క‌నిపిస్తుంది. సంతోష‌మే స‌గం బ‌లం.. దాంతోనే అందం ఇనుమ‌డిస్తుంది. హైద‌రాబాద్ ఈవెంట్లోనూ పూజా స్మైలీ లుక్ తో ఎంతో అందంగా క‌నిపించింది.

రెండో షెడ్యూల్ కి రెడీ.. SSMB28 ప్రారంభ షెడ్యూల్ లో కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. వీటిని అన్బరివ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించగా ఎస్.ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 2019 యాక్షన్ డ్రామా మహర్షిలో సూపర్ స్టార్ మ‌హేష్ స‌ర‌స‌న పూజా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు రెండోసారి మ‌హేష్ స‌ర‌స‌న జోడీగా న‌టిస్తోంది. ఈ మూవీ రెండో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌కు రంగం సిద్ధ‌మైంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.