Begin typing your search above and press return to search.

ప్రభాస్ సినిమాలు.. ఏది ఎప్పుడంటే?

By:  Tupaki Desk   |   7 Jun 2023 5:01 PM GMT
ప్రభాస్ సినిమాలు.. ఏది ఎప్పుడంటే?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ఆదిపురుష్ మూవీ జూన్ 16న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ ప్రభాస్ మాట్లాడుతూ ఏడాదికి రెండు నుంచి మూడు సినిమాలు చేస్తానని చెప్పారు. ఎక్కువ సినిమాలు చేసుకుందాం. తక్కువ మాట్లాడుకుందాం అంటూ అభిమానులతో అన్నాడు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభాస్ చేస్తోన్న సినిమాలపై స్పష్టమైన క్లారిటీతోనే ఈ విషయాన్ని చెప్పాడనే మాట వినిపిస్తోంది. ఆయన సినిమాల లైన్ అప్ చూసుకుంటే ప్రభాస్ కరెక్ట్ ప్లానింగ్ తో ఉన్నాడనే విషయం అర్ధమవుతోంది. జూన్ 16న ప్రభాస్ ఆదిపురుష్ మూవీ రాబోతోంది. అలాగే సెప్టెంబర్ 28న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ మూవీ రిలీజ్ కానుంది.

ఈ ఏడాదికి ప్రభాస్ ఈ రెండు సినిమాల రిలీజ్ ప్లాన్ చేశారు. ఇక వచ్చే ఏడాది జనవరి 12న ప్రాజెక్ట్ కె మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ అవ్వనుంది. దీనిపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే మారుతి దర్శకత్వంలో రాజా డీలాక్స్ మూవీ సమ్మర్ కానుకగా వచ్చే ఏడాది ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతోంది. ఇలా 2024 రెండు సినిమాలు ప్లాన్ చేశారు.

ఇదే లైన్ లో సలార్ 2, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ లో ఒక సినిమా ఫైనల్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు 2025లో ప్రభాస్ నుంచి ప్రేక్షకుల ముందుకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా పాన్ ఇండియా లెవల్ లో మూవీస్ అయిన కూడా ఏడాదికి రెండు సినిమాలకి తక్కువ కాకుండా ప్రభాస్ రిలీజ్ ప్లాన్ చేస్తూ ఉండటం నిజంగా విశేషం అని చెప్పాలి.

ఇక మరో 10 రోజుల్లో రిలీజ్ కాబోయే ఆదిపురుష్ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది. రామాయణం కథ ఆధారంగా వస్తోన్న సినిమా కావడంతో పాటు చిత్ర ట్రైలర్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండటం ఆదిపురుష్ పై అంచనాలు పెరగడానికి కారణం అని చెప్పొచ్చు.