సుశాంత్ ఫ్యాన్స్ కు డిస్నీ హాట్ స్టార్ బంపర్ ఆఫర్

Tue Jul 07 2020 16:20:20 GMT+0530 (IST)

Can Dil Bechara be watched without Disney+Hotstar subscription

బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో సుశాంత్ రాజ్ పూత్ ఆత్మహత్య ఆయన అభిమానులను తీవ్రంగా కలచి వేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ అలా మరణించడంను ఏ ఒక్కరు జీర్ణించుకోలేక పోతున్నారు. పలు సినిమాలతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న సుశాంత్ చివరగా నటించిన చిత్రం ‘దిల్ బేచరా’. ఈ చిత్రం విడుదలకు సిద్దం అయిన సమయంలో థియేటర్లు క్లోజ్ అయ్యాయి. దాంతో సినిమాను ఓటీటీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. సుశాంత్ చివరి సినిమా అవ్వడం వల్ల థియేటర్ లోనే చూడాలనుకుంటున్నాం అంటూ ఫ్యాన్స్ ఓటీటీ రిలీజ్ ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే నిర్మాతలు మాత్రం ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు కనుక ఓటీటీలోనే విడుదల చేయాలని డిస్నీ హాట్ స్టార్ కు స్ట్రీమింగ్ హక్కులను అమ్మేయడం జరిగింది.సుశాంత్ అభిమానులు అంతా కూడా దిల్ బేచరా ను చూడాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ గా చూసే అవకాశంను కల్పించారు. సాదారణంగా అయితే ఇలాంటి కొత్త సినిమాలను పెద్ద హీరోల సినిమాలను కేవలం ప్రీమియర్ యూజర్లకు మాత్రమే చూసే అవకాశం కల్పిస్తారు. కాని సుశాంత్ చివరి సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి చేరాలనే ఉద్దేశ్యంతో ఉచితంగా అందరు స్ట్రీమింగ్ చేసేలా వెసులుబాటు ఇచ్చారు. ఇది ఆయన అభిమానులకు బంపర్ ఆఫర్ గా చెప్పుకోవచ్చు. ఈనెల 24న విడుదల కాబోతున్న దిల్ బేచరా సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. సుశాంత్ చివరి సినిమా అవ్వడం వల్ల దిల్ బేచరా పై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి అంచనాలను సినిమా అందుకుంటుందా చూడాలి.