Begin typing your search above and press return to search.

గంగవ్వ కోసం సీఎం కేసీఆర్‌ పీఆర్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌

By:  Tupaki Desk   |   19 Sep 2020 5:30 PM GMT
గంగవ్వ కోసం సీఎం కేసీఆర్‌ పీఆర్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌
X
ఈ సీజన్‌ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గంగవ్వకు మొన్నటి వరకు సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌. గంగవ్వను ఫైనల్ వారం వరకు ఇంట్లోనే ఉండేలా ఆమెకు ఓట్లు వేస్తామన్నారు. షో చూడని వారు కూడా ఈసారి గంగవ్వ ఎలిమినేషన్‌ లో ఉంటే ఓట్లు వేస్తున్నారు. అది మొన్నటి వరకు మాత్రమే. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. గంగవ్వ షో లో ఉండలేక పోతుంది. ఆమెకు అక్కడి వాతావరణం పడటం లేదు.

ఊర్లో ఉండేగ గంగవ్వకు అక్కడ ఏసీల్లో ఉండాలంటే వసపడటం లేదు. నన్ను బయటకు పంపండి అంటూ పలు సార్లు గంగవ్వ బిగ్‌ బాస్‌ కు విజ్ఞప్తి చేసింది. అయితే బిగ్‌ బాస్‌ నియమాల ప్రకారం అలా బయటకు పంపడానికి లేదు. ప్రేక్షకులు మాత్రమే కంటెస్టెంట్స్‌ ను బయటకు పంపించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో గంగవ్వకు ఓట్లు వేయవద్దంటూ ప్రచారం మొదలైంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ పీఆర్‌ టీం సభ్యుడు అయిన రమేష్‌ హజారీ కూడా సోషల్‌ మీడియా పేజ్‌ లో గంగవ్వను బయటకు తీసుకు రావాలంటూ క్యాంపెయిన్‌ మొదలు పెట్టారు.

పచ్చని పొలాల మద్య హాయిగా జీవితాన్ని సాగించే గంగవ్వను జైలు వంటి బిగ్‌ బాస్‌ హౌస్‌ కు వెళ్లమన్నది ఎవరు. అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి కాని మనసున్న మనుషులు మాత్రం ఉండరు అనే విషయం ఆమెకు తెలియదు. రేటింగ్‌ కోసం అక్కడ ఏడిపించడం మనం చూస్తూ ఉంటాం. మానవ సంబంధాల మద్య పరీక్షలు పెట్టే గేమ్‌ షో అంటూ రమేష్‌ హజారీ తన పోస్ట్‌ లో పేర్కొన్నారు.

ఆమె ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. నీ ఏడుపుకు పైసలు కురుస్తున్నాయని వారు సంతోషంగా ఉన్నారు. అందుకే నిన్ను అందులోనే ఉంచాలని కోరుకుంటున్నారు. జైలు వంటి బిగ్‌ బాస్‌ నుండి గంగవ్వను వెంటనే విడుదల చేయాలంటూ ఆయన డిమాండ్‌ చేశారు. అందరం కలిసి గంగవ్వను జన జీవన స్రవంతిలోకి తీసుకు వద్దాం అంటూ ఆయన పేర్కొన్నారు. దీంతో ఆమె బయటకు అతి త్వరలోనే వస్తుందేమో అనిపిస్తుంది. వచ్చే వారంలో కూడా ఒక వేళ గంగవ్వ ఎలిమినేషన్‌ లో ఉంటే ఆమెకు ఓట్లు వేయవద్దంటూ ప్రచారం చేసే అవకాశం ఉంది.