టాప్ స్టోరి: పెళ్లి తర్వాత బిజీ కపుల్స్

Sat May 25 2019 12:02:50 GMT+0530 (IST)

Busy Couples After Marriage

పెళ్లికి ముందు జంటగా నటించడం వేరు. పెళ్లి తర్వాత పెయిర్ రిపీటవ్వడం వేరు. ఆఫ్టర్ మ్యారేజ్ నటిస్తున్న జంటల జాబితా పరిశీలిస్తే టాలీవుడ్ సహా ఇరుగు పొరుగు పరిశ్రమల్లోనూ పలువురు బిజీ కెరీర్ ని ప్లాన్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత బిజీ అయిన స్టార్ కపుల్ జాబితాను పరిశీలిస్తే ఆసక్తికర సంగతులే తెలిశాయి.టాలీవుడ్ లో నాగచైతన్య- సమంత జంట పెళ్లి తర్వాతా కలిసి వరుసగా సినిమాల్లో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ జంట పెళ్లి తర్వాత నటించిన `మజిలీ` గ్రాండ్ విక్టరీ అందుకుంది. ఆ తర్వాత వేరొక స్క్రిప్టు విన్నారని తెలుస్తోంది. అయితే అందుకు సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే తమిళ హీరో ఆర్య ఇటీవలే హీరోయిన్ సయేషా సైగల్ ని పెళ్లాడాడు. ఈ జంట పెళ్లికి ముందు గజినీ కాంత్ అనే చిత్రంలో నటించారు. `భలే భలే మగాడివోయ్` చిత్రానికి రీమేక్ ఇది. ప్రస్తుతం పెళ్లి తర్వాత `టెడ్డీ` అనే చిత్రానికి సంతకం చేశారు. శంక్తి సౌందర రాజన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

బిపాస  - కరణ్ జంట పెళ్లికి ముందు కలిసి నటించారు. అప్పట్లో `ఎలోన్` అనే హారర్ చిత్రంలో నటించారు. తర్వాత వేరొక మూవీలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆదాత్ డైరీస్ అనే హారర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. భూషణ్ పటేల్ దర్శకత్వంలో విక్రమ్ భట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లండన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఇది. రణవీర్ సింగ్ - దీపిక పెళ్లి తర్వాత నటించలేదు. అయితే ఈ జంటతో సంజయ్ లీలా భన్సాలీ ఓ భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారని ఇదివరకూ వార్తలొచ్చాయి. వీళ్లతో మూడు సినిమాల కాంట్రాక్ట్ కి అతడు సంతకం చేయించుకున్నారని చెప్పుకున్నారు. అయితే అధికారికంగా తదుపరి చిత్రాన్ని ప్రకటించాల్సి ఉంది. రణవీర్ - దీపిక జోడీ పెళ్లికి ముందు పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. పెళ్లి తర్వాతా ఈ జంటకు ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగిన సంగతి తెలిసిందే. అలాగే అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యారాయ్ బచ్చన్ జంటగా పెళ్లికి ముందు ఎనిమిది సినిమాల్లో నటించారు. పెళ్లి తర్వాత విలన్ (మణిరత్నం) చిత్రంలో నటించారు. అటుపైనా పలు మార్లు ప్రయత్నాలు చేసినా కుదరలేదు. మునుముందు నటించే వీలుందని తెలుస్తోంది. ఇకపోతే పెళ్లి తర్వాత పలువురు స్టార్లు ఎవరికి వారు విడివిడిగానూ ఇండివిడ్యువల్ కెరీర్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.