Begin typing your search above and press return to search.

బ‌న్ని రియ‌ల్ సూప‌ర్ స్టార్.. నువ్వేమో కాపీ క్యాట్!

By:  Tupaki Desk   |   28 Jan 2023 6:00 AM GMT
బ‌న్ని రియ‌ల్ సూప‌ర్ స్టార్.. నువ్వేమో కాపీ క్యాట్!
X
బాలీవుడ్ యువ‌హీరో కార్తీక్ ఆర్యన్ జైత్ర‌యాత్ర గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇప్పుడు 'అల వైకుంఠ‌పుర‌ములో' రీమేక్ గా వ‌స్తున్న‌ 'షెహజాదా' ట్రైలర్ వెబ్ లోకి దూసుకెళ్లింది. అత‌డి అభిమానుల నుంచి భారీ ప్ర‌శంస‌లు కురిసాయి. షారూఖ్ ఖాన్ పఠాన్ ట్రైలర్ కు వచ్చిన స్పందనను మించి భారీ లైక్ ల‌తో షెహ‌జాదా ట్రైల‌ర్ దూసుకెళ్లింద‌న్న‌ చ‌ర్చ వెబ్ లో సాగుతోంది. అభిమానులు ప్ర‌చారచిత్రంలోని కార్తీక్ యాక్షన్- రొమాన్స్ డ్యాన్స్ ని ఇష్టపడ్డారు. సినిమా ఆద్యంతం మ‌రో స్థాయిలో అల‌రించ‌గ‌ల‌డ‌ని న‌మ్ముతున్నారు.

అయితే ఒక సెక్ష‌న్ మాత్రం అందుకు భిన్నమైన‌ స్వ‌రం వినిపిస్తోంది. ''ఇది ఒరిజిన‌ల్ కార్తీక్ కాదు.. అత‌డు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని అనుక‌రిస్తున్నా''డ‌ని కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు. అల్లు అర్జున్- పూజా హెగ్డే జంట‌గా న‌టించిన‌ సూపర్ హిట్ చిత్రం 'అల వైకుంఠపురములో' చిత్రానికి షెహ‌జాదా రీమేక్ కావ‌డంతో పోలిక‌లు చూస్తున్నారు. పుష్పరాజ్ గా సుప‌రిచితుడైన ఐకాన్ స్టార్ బ‌న్ని న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో తెలుగు వెర్ష‌న్ ని హిందీ ఆడియెన్ లో చాలా మంది ఇప్ప‌టికే వీక్షించ‌డంతో ఇప్పుడు కార్తీక్ కి ఇది మైన‌స్ గా మారింది. అల్లు అర్జున్ న‌ట‌నా శైలి- నృత్యం- యాక్షన్ ప్ర‌తిదీ ఉత్త‌రాది ఆడియెన్ కి సుప‌రిచిత‌మే. అల వైకుంఠ‌పుర‌ములో దక్షిణాదిన‌ బ్లాక్ బస్టర్ గా నిల‌వ‌డానికి బ‌న్ని న‌ట‌న ఒక‌ ప్ర‌ధాన కార‌ణం.

చాలా మంది కార్తిక్ ఆర్య‌న్ అభిమానులు తమ ఫేవ‌రెట్ ను ప్రశంసించగా ఒరిజిన‌ల్ వెర్ష‌న్ నుంచి అల్లు అర్జున్ ను నేరుగా కాపీ చేసాడంటూ ప‌లువురు నెటిజనులు కాస్త ఘాటుగానే ట్రోల్ చేశారు. ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ ప్రతి సీన్ లోనూ సౌత్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ కాపీ కొట్టాల్సిన అవసరం కార్తీక్ కి లేదని సోషల్ మీడియా యూజర్లు అభిప్రాయపడుతున్నారు. కొంద‌రు సౌత్ ఇండియన్ ఫ్యాన్స్ కూడా బన్నీ నిజమైన సూపర్ స్టార్ అని ప్ర‌శంసిస్తూ కార్తీక్ ని దుయ్య‌బ‌డుతున్నారు.

రోహిత్ ధావన్ దర్శకత్వం వహించిన హిందీ రీమేక్ 'షెహ‌జాదా'లో కృతి సనన్ కథానాయిక. ఈ ఏడాది ఫిబ్రవరి 10న సినిమా థియేటర్లలోకి రానుంది. షెహజాదా ట్రైలర్ కి వచ్చిన అనూహ్య స్పందన చూస్తుంటే ఈ సినిమా థియేటర్లలో మంచి ఓపెనింగ్స్ సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

కానీ బ‌న్ని అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం వీక్షించిన ఉత్త‌రాది ఆడియెన్ కి హిందీ వెర్ష‌న్ అంత‌గా రుచిస్తుందా? అన్న‌ది చూడాలి. కానీ కార్తీక్ ఆర్య‌న్ లాంటి ప్ర‌తిభావంతుడైన హీరో భూల్ భుల‌యా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తో దూకుడుమీద ఉన్నాడు. వ‌రుస చిత్రాల‌తో హిట్లు కొడుతున్న ఉత్సాహంలో ఉన్నాడు. న‌టుడిగా అత‌డిని త‌క్కువ అంచ‌నా వేయ‌లేం.

గత ఏడాది బాలీవుడ్ హెవీ వెయిట్ సూపర్ స్టార్స్ నటించిన ప్రముఖ బ్యానర్ల అతి భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్ట‌ర్లు అవుతున్నప్పుడు 'భూల్ భులయా 2' చిత్రం రూ. 200 కోట్లకు పైగా రాబట్టగలిగింది. ఈ క్రెడిట్ కార్తీక్ ఆర్య‌న్ ఖాతాలోకే వెళ్లింది. అంత‌గా ప్ర‌భావితం చేయ‌గ‌లిగే స్టార్ గా కార్తీక్ ఆర్య‌న్ ఎదిగాడు. గత కొన్నేళ్లుగా అత‌డి గ్రాఫ్ అమాంతం పెరుగుతూనే ఉంది. 'ధమాకా' త‌ర్వాత క్రేజ్ ఆకాశాన్ని తాకింది. రజత్ శర్మ 'ఆప్ కి అదాలత్‌'లో అతని న‌ట‌ప్రదర్శన రికార్డు స్థాయిలో 41.5 శాతం వీక్షకులను ఆకర్షించింది. కార్తీక్ ఆర్యన్ తన చివరి OTT విడుదలైన 'ఫ్రెడ్డీ'లో న‌ట‌న‌కు కూడా ప్రశంసలుతో పాటు అభిమానుల నుంచి భారీ ప్ర‌శంస‌లు అందుకున్నాడు. అత‌డు త‌న స్టార్ డమ్ పై చాలా నమ్మకంగా ఉన్నాడు. పారితోషికం కూడా పెంచాడు. కష్టపడి పని చేస్తాన‌ని త‌న‌కు పెద్ద పారితోషికం తీసుకునే అర్హ‌త వ‌చ్చింద‌ని కాన్ఫిడెంట్ గా ప్ర‌క‌టించాడు కార్తీక్.

ముఖ్యంగా బాలీవుడ్ తో సంబంధం లేని అతికొద్ది మంది నటులలో అతను ఒకడు. ఇన్ సైడ‌ర్స్ హ‌వా సాగిస్తున్న ఇలాంటి స‌మ‌యంలో ఔట్ సైడ‌ర్ గా వ‌చ్చి న‌ట‌వార‌సులంద‌రినీ అధిగ‌మించి ఎదిగేస్తున్నాడు. ఇప్పటివ‌ర‌కూ వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో విజయవంతమైన కెరీర్ ని డ్రైవ్ చేస్తున్నాడు. యూత్ లో అత‌డికి భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. నేటి బంధుప్రీతి యుగంలో కార్తీక్ ఆర్య‌న్ యూనిక్ పీస్ అన‌డంలో సందేహం లేదు. బాలీవుడ్ క్రైసిస్ లో ఉన్న వేళ ప‌ఠాన్ తో కొంత ఊర‌ట ద‌క్కుతోంది. యువ‌హీరో కార్తీక్ ఆర్య‌న్ న‌టించిన హెష‌జాదా కూడా విజ‌యం సాధించాల‌నే ఆకాంక్షిద్దాం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.