Begin typing your search above and press return to search.

అల్లు శిరీష్ బడ్డి గ్లింప్స్… మరో ఇంటరెస్టింగ్ టెడ్డి స్టొరీ

By:  Tupaki Desk   |   30 May 2023 5:32 PM GMT
అల్లు శిరీష్ బడ్డి గ్లింప్స్… మరో ఇంటరెస్టింగ్ టెడ్డి స్టొరీ
X
అల్లు శిరీష్ చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ ఉంటాడనే సంగతి అందరికి తెలిసిందే. ఎక్కువగా కాన్సెప్ట్ బేస్డ్ కథలని ఎంపిక చేసుకొని ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చివరిగా అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షశివో అనే మూవీతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ మూవీ బాగుందనే టాక్ తెచ్చుకున్న కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లు శిరీష్ నుంచి ఓ ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తెలుగు, తమిళ్ భాషలలో అల్లు శిరీష్ బడ్డి అనే మూవీ చేస్తున్నాడు. సామ్ అంటోన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. కోలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ని లాంచ్ చేశారు. మాస్క్ లు వేసుకొని ఉన్న ఓ ముఠా బడ్డి అనే ప్రాణం ఉన్న టెడ్డి బేర్ ని చంపడానికి స్కెచ్ వేస్తారు. దానిని చంపిన వారికి గ్యాంగ్ లీడర్ భారీగా డబ్బు ఆఫర్ చేస్తాడు. దీంతో బడ్డిని పట్టుకోవడానికి వారంతా రెడీ అవుతారు. ఓ మెట్రో ట్రైన్ లో బడ్డి సాంగ్స్ వింటూ డాన్స్ చేస్తూ ఉంటుంది. దానిని ఎటాక్ చేయడానికి వచ్చిన గ్యాంగ్ ని హీరో అల్లు శిరీష్ ఫైట్ చేసి చంపేస్తాడు.

గ్లింప్స్ లో సింపుల్ గా చూపించిన ఈ యాక్షన్ సీన్ తో కథని ఏ విధంగా చెప్పబోతున్నాం అనేది దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. స్టూడియో గ్రీన్ గతంలో తమిళంలో ఆర్యతో టెడ్డి అనే సినిమా చేశారు. దానికి సీక్వెల్ గానే ఇప్పుడు బడ్డిని తీసుకొస్తున్నట్లు గ్లింప్స్ ఆరంభంలోనే క్లారిటీ ఇచ్చారు. బడ్డిని చంపడానికి గ్యాంగ్ ఎందుకు ట్రై చేస్తోంది అనేది కథలో భాగంగా ఉండబోతోంది.

ఇక ఈ సినిమాకి హిప్ హాప్ తమీజా మ్యూజిక్ అందిస్తున్నాడు. కేఈ జ్ఞాన్ వేల్ రాజా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్నారు. గతంలో అల్లు శిరీష్ మొదటి సినిమా గౌరవం తెలుగు, తమిళ్ భాషలలో చేశాడు. మరల ఇన్నేళ్ళ తర్వాత బడ్డితో రెండు భాషలలో ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీ ఏ మేరకు అతనికి సక్సెస్ ఇస్తుందనేది చూడాలి.