ఎన్టీఆర్ ను విజయనగరం తీసుకెళ్లబోతున్న బుచ్చి

Fri Jan 28 2022 19:00:01 GMT+0530 (IST)

Buchi is going to take NTR to Vijayanagar

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం దాదాపుగా నాలుగు ఏళ్ల సమయం కేటాయించాడు. ఇప్పటికే ఆ సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల ఆలస్యం అవుతోంది. కరోనా వల్ల తదుపరి సినిమా కూడా ఆలస్యం అవుతూ వస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో కన్ఫర్మ్ అయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ తో ఉప్పెన చిత్ర దర్శకుడు బుచ్చి బాబు సినిమా కూడా మొదలు అవ్వాల్సి ఉంది. మొదటి సినిమా తోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బుచ్చి బాబు తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయబోతున్నట్లుగా అధికారికంగా చెప్పలేదు కాని ఆయన ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేస్తున్నట్లుగా చెప్పకనే పలు సందర్బాల్లో.. పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ మరియు బుచ్చి బాబు ల కాంబో మూవీ పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.ఈ సమయంలో ఎన్టీఆర్ కోసం బుచ్చి బాబు రెడీ చేసిన కథ గురించి మీడియా వర్గాల్లో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కథ ఎక్కువగా విజయనగరం ప్రాంతంలో జరుగుతుందని సమాచారం అందుతోంది. షూటింగ్ లో మెజార్టీ భాగం కూడా విజయనగరం మరియు పరిసర ప్రాంతాల్లోనే షూట్ చేయబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఇప్పటికే దర్శకుడు బుచ్చి బాబు అక్కడ లొకేషన్స్ ను కూడా పట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. కథ చాలా సింపుల్ గా ఉంటుందని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్ గుర్తింపు దక్కించుకోబోతున్నాడు. అయితే అందుకు విభిన్నంగా ఈ సినిమా పాన్ ఇండియా స్క్రిప్ట్ కాకుండా తెలుగు నేటివిటీతో ఉండే కథలా ఉంటుందని కొందరు అంటున్నారు. మరి ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమా విషయమై దర్శకుడు బుచ్చి బాబు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ సినిమా పట్టాలెక్కాలంటే ఖచ్చితంగా ఈ ఏడాది చివరి వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు.

సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన బుచ్చి బాబు మొదటి సినిమా తోనే వంద కోట్ల వసూళ్లను దక్కించుకుని రికార్డు సృష్టించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఏ దర్శకుడు కూడా ఈ అరుదైన రికార్డును దక్కించుకోలేదు. కాని బుచ్చి బాబు మాత్రం అనూహ్యంగా వంద కోట్ల వసూళ్లు దక్కించుకుని రెండవ సినిమా తోనే ఏకంగా ఎన్టీఆర్ వంటి సూపర్ స్టార్ తో సినిమా ను చేసే అవకాశం దక్కించుకున్నాడు. అయితే ఆయన కరోనా వల్ల వచ్చిన అద్బుత అవకాశం ఆలస్యం అవుతుంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఎన్టీఆర్ మరియు బుచ్చి బాబు కాంబో మూవీ వచ్చే ఏడాది లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ మరియు బుచ్చి బాబు ల కాంబో మూవీ పై మొదటి నుండే అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇప్పుడు కథ విషయమై వస్తున్న వార్తలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. సినిమా కు సంబంధించిన షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలు పెడతారా అంటూ ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు. కొరటాల శివ తో చేయబోతున్న సినిమా తర్వాత కేజీఎఫ్ ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది. ఈ మూడు ప్రాజెక్ట్ లు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ మరో రెండు మూడు సినిమాలకు కూడా ఓకే చెప్పాడు. అవి ఎప్పటి వరకు మొదలు అయ్యేది క్లారిటీ లేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా మూడ్ నుండి బయటకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సినిమా కోసం కాస్త బాడీ కూడా పెంచాడు. ఇప్పుడు కొరటాల శివ సినిమా కోసం బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.