బుచ్చిబాబు మరో దారి చూసుకుంటున్నాడా..?

Tue Jul 27 2021 05:00:01 GMT+0530 (IST)

Disappointed Buchi Babu To Work With Mega Hero

'ఉప్పెన' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు.. ఫస్ట్ సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్నాడు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ 100 కోట్ల సినిమా ఇచ్చాడు. అయితే ఐదు నెలలు దాటిపోయినా ఇంకా బుచ్చిబాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ రాలేదు.'ఉప్పెన' తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి బుచ్చిబాబు ప్లాన్ చేసుకున్నారు. దర్శకుడు చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో తారక్ సైడ్ నుంచి పాజిటివ్ సిగ్నల్ వచ్చింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఆంధ్రప్రదేశ్ లో జరిగే కథ ఇదని.. ఎన్టీఆర్ ను ఇందులో రూరల్ గెటప్ లో చూపించనున్నారని టాక్ వచ్చింది.

అయితే ఎన్టీఆర్ కు ఈ కథ నచ్చినప్పటికీ.. ఆల్రెడీ కమిటైన ప్రాజెక్ట్స్ ఉండటంతో బుచ్చిబాబు చిత్రానికి సైన్ చేయలేదని తెలుస్తోంది. కాకపోతే వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు వెయిట్ చేయాలని.. అప్పుడు తనతో సినిమా చేస్తానని బుచ్చిబాబు కు ఎన్టీఆర్ హామీ ఇచ్చినట్టు టాక్. ఆలోపు తారక్ ప్రస్తుతం నటిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' తో పాటుగా కొరటాల శివ మరియు ప్రశాంత్ నీల్ చిత్రాలను పూర్తి చేసే అవకాశం ఉంది.

అప్పటి వరకు ఎన్టీఆర్ డేట్స్ దొరికే పరిస్థితి లేదు కాబట్టి.. ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలని బుచ్చిబాబు నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలో తన మొదటి హీరో పంజా వైష్ణవ్ తేజ్ తో కలిసి ఇంకో సినిమా చేయడానికి బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నారట. దీనికి మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాతలుగా ఉంటారని టాక్.

ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత బుచ్చిబాబుకు అగ్ర నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్స్ వచ్చాయి కానీ.. దర్శకుడు మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనే తన రెండో సినిమా చేయడానికి కమిట్ అయ్యారు. మరి ఇప్పుడు వరుస సినిమాలకు సైన్ చేస్తూ వస్తున్న.. వైష్ణవ్ తేజ్.. ఇప్పుడు బుచ్చిబాబు తో సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేస్తారేమో చూడాలి. ఇదే కనుక జరిగితే మరోసారి 'ఉప్పెన' కాంబోని చూసే అవకాశం ప్రేక్షకులకు కలుగుతుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.