ఓటీటీకే సై అంటున్న సూపర్ స్టార్

Mon Jan 17 2022 18:03:05 GMT+0530 (IST)

Bro Daddy On OTT

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన చిత్రాలు వరుసగా విజయాల్ని సొంతం చేసుకున్నాయి. గత ఏడాది ఒక్క `మరక్కార్` తప్ప మోహన్ లాల్ చేసిన `దృశ్యం -2` బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేసి సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నారు మలయాళ సూపర్ స్టార్. ఈ మూవీ అందించిన జోష్ తో ఎనిమిది చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో ఓ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పరిస్థితులు మారిపోతుండటంతో ఆయన మరోసారి ఓటీటీకే సై అంటున్నారు. మోహన్ లాల్ నటిస్తున్న తాజా చిత్రం `బ్రో డాడీ`. పృథ్వీరాజ్ సుకుమారన్ మరో హీరోగా నటిస్తూ తానే ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. మీనా కల్యాణీ ప్రియదర్శన్ నిఖిలా విమల్ ఇందులో హీరోయిన్ లుగా నటించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబవార్ నిర్మించిన ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకుంది.

ఫ్యామిలీ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ థియేటర్లలో మాత్రం విడుదల కావడం లేదు. ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కరోనా ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయడానికే మోహన్ లాల్ మొగ్గుచూపుతున్నారట.

అందుకే ఈ మూవీని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేయబోతున్నట్టుగా చెబుతున్నారు. దీంతో ఈ సినిమా కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. గత ఏడాది `దృశ్యం -2`ని ఓటీటీలో రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న మోహన్ లాల్ ఈ ఏడాది `బ్రో డాడీ`తోనూ అదే తరహా విజయాన్ని అందుకోవడం ఖాయం అంటున్నాయి మలయాళ ఇండస్ట్రీ వర్గాలు.

ఇదిలా వుంటే మోహన్ లాల్ నటించిన `దృశ్యం - 2` తెలుగులో రీమేక్ అయి ఓటీటీలో సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటించిన `లూసీఫర్`ని తెలుగులో `గాడ్ పాదర్` పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ  దశలో వుంది.