నవ్వించలేక పోతున్న బ్రహ్మీ ఏడిపించేనా?

Sun Aug 02 2020 17:40:00 GMT+0530 (IST)

Brahmi Doing Serious Role

రెండు దశాబ్దాలకు పైగా టాలీవుడ్ లో టాప్ స్టార్ కమెడియన్ గా స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ను అనుభవించిన బ్రహ్మానందం ఈమద్య కాలంలో ఫామ్ కోల్పోయాడు. ఆయన చేసిన పాత్రలు నవ్వించలేక పోవడంతో మెల్ల మెల్లగా అవకాశాలే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో బ్రహ్మానందం ‘రంగమార్తాండ’ అనే చిత్రంలో సీరియస్ పాత్రను పోషిస్తున్నాడు. ఆ సినిమాలో బ్రహ్మానందం చేస్తున్న పాత్ర ప్రేక్షకులతో కన్నీరు పెట్టించే స్థాయిలో ఎమోషన్స్ ను కలిగి ఉంటుందని అంటున్నారు.బ్రహ్మానదం ఈమద్య కాలంలో నవ్వించలేక పోతున్నాడు. అయినా కూడా ఆయన అభిమానులకు కొదవ లేదు. ఆయన చేసిన వందలాది పాత్రలతో ఇప్పటికి నవ్విస్తూనే ఉన్నాడు. అలాంటి బ్రహ్మానందం సీరియస్ పాత్రను చేస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది అనుమానంగా ఉంది. గతంలో బ్రహ్మానందం సీరియస్ పాత్ర చేసిన బాబాయి హోటల్ నిరాశ పర్చింది. సినిమా పరంగా పాజిటివ్ టాక్ దక్కించుకున్నా కూడా బ్రహ్మానందంను అలా చూడలేక పోయామంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేశారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత బ్రహ్మానందం సీరియస్ పాత్రలో కనిపించబోతున్నాడు. బ్రహ్మీ ఏదో సినిమాలో ఎంతో సీరియస్ గా రౌడీయిజం చేసి కూడా నవ్వించాడు. మరి రంగమర్తాండ చిత్రంలో బ్రహ్మానందంతో సీరియస్ పాత్ర చేయిస్తున్న కృష్ణవంశీ సక్సెస్ అయ్యేనా అనేది చూడాలి.