Begin typing your search above and press return to search.
భారతదేశం లో అత్యంత ధనికుడైన కమెడియన్?
By: Tupaki Desk | 9 Jun 2023 8:34 AMసుమారు 1000 పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ రికార్డ్ స్థాయిని చేరుకున్న మేటి హాస్య నటుడు బ్రహ్మానందం ఇటీవల పాత్రల ఎంపికల పరంగా చాలా సెలెక్టివ్ గా మారారు. ఇప్పుడు విరామ సమయాన్ని తనకు నచ్చిన విధానంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. డ్రాయింగ్ తనకు చాలా ఇష్టమైన మరో కళ. అందుకే ఎక్కువ సమయం చిత్రలేఖనంతోనే గడుపుతున్నారని టాక్ ఉంది.
బ్రహ్మానందం పేరులోనే ఆనందం ఉంది. అసలు వృద్ధాప్యం అన్నదే తనకు లేదు. నటుడిగా ఉన్నత శిఖరాలకు చేరిన బ్రహ్మీకి దేనిలోనూ కొదవేమీ లేదు. తనదైన నటన కామెడీ టైమింగ్ ఆహార్యంతో కోట్లాది మంది ప్రజల్ని అలరించిన అసాధారణ హాస్య నటుడిగా అతడి స్థాయి ఎంతో గొప్పది.
హాస్యంతో ఎమోషనల్ పాత్రలతో ఆయన మెప్పించారు. చిరస్థాయిగా అందరి గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉన్నారు. దశాబ్దాల కెరీర్ లో బ్రహ్మీ విభిన్నమైన పాత్రలు చేస్తూ భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఐకాన్ గా నిలిచారు.
ఇప్పటికీ ఏజ్ లెస్ బ్రహ్మీ నటనలో కొనసాగుతూనే ఉన్నారు. లైఫ్ లో ఎలాంటి భంగపాటు అన్నదే లేకుండా ఇలా ఇంతవరకూ సాఫీగా సాగించడం ఈ రంగుల ప్రపంచంలో తనకు మాత్రమే సాధ్యమైందని నిరూపిస్తున్నారు.
అయితే బ్రహ్మానందం తన సుదీర్ఘ కెరీర్ లో సంపాదించిన నికర ఆస్తుల విలువ ఎంతవరకూ ఉండొచ్చు? అంటూ నెటిజనుల్లో డిబేట్ కొనసాగుతోంది. కొందరు అభిమానులు సోషల్ మీడియాల్లో అందించిన సమాచారం మేరకు.. వివరాలు పరిశీలిస్తే ఇలా ఉన్నాయి.
బ్రహ్మానందం ఒక్కో సినిమాకు 1-2కోట్ల ఆర్జిస్తున్నారు. దాదాపు 1000 పైగా చిత్రాల్లో నటించిన బ్రహ్మీ తన సంపాదనను తెలివైన పెట్టుబడులుగా పెట్టి భారీ ఆర్జకుడిగా ఎదిగారు. సుమారు 350కోట్ల మేర ఆస్తులను కలిగి ఉన్నారని సోషల్ మీడియాల్లో ప్రచారమవుతోంది.
అయితే దీనికి సంబంధించి డా.బ్రహ్మానందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రజల హృదయాల్లో నిలిచి ఉండడమే గొప్ప ఆస్తి. అది అతడు ఏనాడో సంపాదించారు. ఇతర ఆస్తులన్నీ బ్రహ్మీకి బోనస్ అని భావించాలి.