Begin typing your search above and press return to search.

'రంగ‌మార్తాండ' కోసం బ్ర‌హ్మానందం ప‌స్తు!

By:  Tupaki Desk   |   20 March 2023 9:37 AM GMT
రంగ‌మార్తాండ కోసం బ్ర‌హ్మానందం ప‌స్తు!
X
హాస్య‌బ్ర‌హ్మ బ్ర‌హ్మానందం వేంగం మ‌ళ్లీ పుంజుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఆ మధ్య సినిమాల జోరు కాస్త త‌గ్గిన‌ట్లు అనిపించినా మ‌ళ్లీ బిజీ అవుతున్నారు. గ‌తేడాది మూడు సినిమాలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ఈ ఏడాది 'వీర సింహారెడ్డి'తో గ్రాండ్ స‌క్సెస్ ని ఖాతాలో వేసుకున్నారు. అయితే ఇవ‌న్నీ బ్ర‌హ్మానందం త‌ర‌హా హాస్య‌ పాత్ర‌లే. గ‌తంలో ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో మ‌రికొన్ని సినిమాలు తెర‌కెక్కాయి. అయితే 'రంగ‌మార్తాండ' వీట‌న్నింటి ని నంచి బ్రహ్మానందాన్ని వేరు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.

ఇందులో ఆయ‌న కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఎమోష‌న‌ల్ గా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర చేసే పాత్ర‌గా తెలుస్తుంది. ఇప్ప‌టికే లీకైన టాక్ ని బ‌ట్టి బ్ర‌హ్మానందం పాత్ర ఆయ‌న‌కి న‌టుడిగా కొత్త ర‌క‌మైన గుర్తింపును తీసుకొస్తుంద‌ని టాక్ వినిపిస్తుంది. ప్ర‌కాష్ రాజ్-బ్ర‌హ్మానందం పాత్ర‌లు ఆద్యంతం హృద్యంగా ఉంటాయ‌ని సినిమా చూసిన వారు చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా కోసం హాస్య బ్ర‌హ్మానందం ఎంత‌గా ఎఫెర్ట్ పెట్టి ప‌నిచేసారు అన్న‌ది ద‌ర్శ‌కుడు కృష్ణ‌ వంశీ మాట‌ల్ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది.

బ్ర‌హ్మానందం పాత్ర లుక్ కోసం ఏమీ తిన‌కుండానే షూటింగ్ లో పాల్గొనే వారుట‌. ఏదైనా తింటే ఆహార్యం లో మార్పులు వ‌స్తాయ‌ని డైట్ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు తెలుస్తుంది. అలాగే సీన్ కోసం ఎన్ని టేకులైనా ఎంతో ఓపిక‌గా చేసేవారుట‌. వీలైనంత‌గా స‌న్నివేశాలు స‌హ‌జంగానే ఉండాల‌ని టేక్ లు మీద టేకులు తీసుకుని చేసిన‌ట్లు తెలిపారు. సాధార‌ణంగా సీనియ‌ర్ న‌టులు ఎవ‌రూ అన్ని టేక్ లు తీసుకోరు.

మ‌హా అయితే నాలుగైదు టేక్ లతో సీన్ పూర్తి చేస్తారు. కానీ 'రంగ‌మార్తాండ‌' కోసం బ్ర‌హ్మానందం అన్ని టేక్ లు తీసుకుంటున్నారు? అంటే ఈ క‌థ‌ని..అందులో ఆయ‌న పాత్ర‌ని ఎంత‌గా ప్రేమించారు అన్న‌ది అద్దం ప‌డుతుంది. ఇప్ప‌టివ‌ర‌కూ తెర‌పై హాస్య‌బ్ర‌హ్మ‌నే చూసాం. 'రంగ‌మార్తాండ‌'లో అందుకు భిన్న‌మైన పాత్ర పోషించి కొత్త ఇమేజ్ ని సొంతం చేసుకోబోతున్నారు. వెండి తెర‌పై ఆయ‌న న‌ట ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.