Begin typing your search above and press return to search.
సాఫ్ట్ కుర్రాడిలో విలనిజం చూపించబోతున్న బోయపాటి
By: Tupaki Desk | 1 Feb 2023 8:00 AMబోయపాటి సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం ఉంది.. ఆయన తీసే సినిమాలన్నీ కూడా భారీ యాక్షన్ సినిమాలు.. ఊర మాస్ సన్నివేశాలను కలిగి ఉంటాయి. అఖండ.. లెజెండ్ రేంజ్ యాక్షన్ సన్నివేశాలు కేవలం బోయపాటికే సాధ్యం అన్నట్లుగా ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉంటారు.
లెజెండ్ సినిమా తో జగపతిబాబును విలన్ గా చూపించి.. అఖండ సినిమాలో శ్రీకాంత్ ను విలన్ గా చూపించి మెప్పించిన దర్శకుడు బోయపాటి. విలన్ ను అత్యంత క్రూరంగా చూపించి ప్రేక్షకులను సైతం ఆశ్చర్యపరిచే దర్శకుడు బోయపాటి. ఈ దర్శకుడు ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.
హీరోగా రామ్ నటిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రలో ప్రిన్స్ ను నటింపజేస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. పలు సినిమాల్లో నటించడంతో పాటు బిగ్ బాస్ లో కూడా సందడి చేసిన ప్రిన్స్ కు సాఫ్ట్ బాయ్ అనే పేరు పడింది. అతడు డీజే టిల్లు లో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు.
ఇప్పుడు రామ్ మరియు బోయపాటి సినిమాలో ప్రిన్స్ అంతకు మించిన విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రిన్స్ లోని విలనిజం ను బోయపాటి చూపించబోతున్నాడట. ఇప్పటి వరకు సాఫ్ట్ పాత్రల్లో మాత్రమే కనిపించిన ప్రిన్స్ ఈ సినిమా నుండి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించే అవకాశాలు ఉన్నాయి.
ఈ సినిమా తో టాలీవుడ్ కు మరో విలక్షణ విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టు లభించినట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. రామ్ మరియు బోయపాటి శ్రీను కాంబో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఆ సినిమా ఉంటుందా అనేది చూడాలి. త్వరలో సినిమా అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.