బాక్సాఫీస్ ట్రాక్.. మెగాస్టార్ తో చేరిన సుహాస్ సినిమా..

Mon Feb 06 2023 11:26:40 GMT+0530 (India Standard Time)

Box office track.. Suhas movie joined with Megastar..

కలర్ ఫొటో సినిమాతో హీరోగా మారిన సుహాస్ నటించిన తాజా చిత్రం రైటర్ పద్మభూషణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. బాక్సాఫీసు వద్ద కూడా భారీ వసూళ్లనే రాబడుతోందీ చిత్రం. అయితే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా విడుదలైన రెండ్రోజుల్లోనే 1.80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ ఏడాదికి గాను హిట్టు సినిమాలో ఖాతాలో చేరిపోయిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమానే కాకుండా ఇదే నూతన ఏడాదిలో విడుదలై హిట్టుగా నిలిచిన సినిమాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.జనవరి 13వ తేదీన విడుదలైన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 865 థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా.. 45.83 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ సొంతం చేసుకొని ఇంకా అదరగొడుతూనే ఉంది.ఇప్పటి వరకు ఈ చిత్రం 134.83 కోట్ల షేర్ తో పాటు 23.02 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో కనిపించగా.. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

నందమూరి బాలకృష్మ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి కూడా హిట్టుగా నిలిచింది. జనవరి 12వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి రూ.67.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ 68 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. మూడు వారాల్లోనే 75.03 కోట్ల షేర్ ను రాబట్టింది. రూ.7.03 కోట్ల ప్రాఫిట్స్ ను పొందింది.

తమిళ స్టార్ హీరో విజయ్ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం వారసుడు కూడా హిట్టు కొట్టింది. జనవరి 14వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఇక్కడ దాదాపు 20 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 210 కోట్లకు పైగా వసూలు చేసింది.  కుటుంబ కథా చిత్రంగా వచ్చిన వారసుడు అన్ని వర్గాల ప్రేక్షులను బాగా ఆకట్టుకుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.