Begin typing your search above and press return to search.

సింగర్ కైలాష్ ఖేర్‌కు చేదు అనుభవం, ఏమైందంటే

By:  Tupaki Desk   |   30 Jan 2023 10:00 PM GMT
సింగర్ కైలాష్ ఖేర్‌కు చేదు అనుభవం, ఏమైందంటే
X
కైలాష్ ఖేర్.. ఈ బాలీవుడ్ సింగర్ తెలుగులోనూ ఎన్నో పాటలు పాడారు. ఆయన పాడిన పాటల్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ పాటలు కూడా ఉన్నాయి. ఇటీవల భరత్ అనే నేను, అరవింద, మిర్చి లాంటి సినిమాలో ఆయన పాడిన పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాంటి ప్రముఖ సింగర్ కు కర్ణాటకలో జరుగుతున్న హంపీ ఉత్సవాల్లో చేదు అనుభవం ఎదురైంది. కొందరు వ్యక్తులు ఆయనపై వాటర్ బాటిళ్లను విసిరేశారు. అసలేం జరిగిందంటే..

కర్ణాటక ప్రభుత్వం ప్రతి ఏటా హంపీ ఉత్సవాలు నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది కూడా అలాగే హంపీ ఉత్సవాలను జనవరి 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహించింది కన్నడ సర్కారు. ఈ ఉత్సవాల్లో భాగంగా వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు సింగింగ్, డ్యాన్సింగ్ లాంటి ప్రదర్శనలు ఇచ్చారు. హంపీ ఉత్సవాలకు హాజరైన కైలాష్ ఖేర్ కొన్ని పాటలు పాడారు. అయితే ఆయన పాడిన సాంగ్స్ లో ఎక్కువగా హిందీ, కొన్ని తెలుగు పాటలు ఉన్నాయి. దీంతో ప్రేక్షకులు కన్నడ పాటలు పాడాల్సిందిగా కోరారు. అదే క్రమంలో కొంత మంది స్టేజ్ పై పాటలు పాడుతున్న కైలాష్ ఖేర్‌పైకి వాటర్ బాటిల్స్ విసిరేశారు.

అక్కడే ఉన్న కర్ణాటక పోలీసులు బాటిల్స్ విసిరిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై అక్కడే ఉన్న కర్ణాటక మంత్రి స్పందించారు. ఈ చర్య బాధాకరమని పేర్కొన్నారు.

ఇటీవల కన్నడ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అందుకుంటున్నాయి. కేజీఎఫ్ తో మొదలైన హిట్లు ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2, చార్లీ 777, కాంతార వంటి సినిమాలతో కన్నడ సినీ రంగానికి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అయితే ఈ క్రమంలోనే కన్నడ సినీ ప్రేక్షకులు భాషాభిమానాన్ని విపరీత స్థాయిలో చూపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సింగర్ మంగ్లీని కన్నడ మాట్లాడాలని ఒత్తిడి చేశారని, ఆమె కన్నడలో మాట్లాడకపోయేసరికి ఆమె కారుపై రాళ్ల దాడి చేశారన్న వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను మంగ్లీ ఖండించారు. ఇప్పుడు కైలాష్ ఖేర్‌పై దాడి జరగడం లైవ్‌లో రికార్డు అయింది. దీనిపై కన్నడ సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.