బాస్ లుక్కు అదిరింది.. మెగా ఫ్యాన్స్ హ్యాపీస్..!

Sat Mar 18 2023 10:18:56 GMT+0530 (India Standard Time)

Boss look is Stunning.. Mega fans are happy..!

ఆస్కార్ కి వెళ్లొచ్చిన రామ్ చరణ్ ఢిల్లీలోనే దిగాడు.. హైదరాబాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఇద్దరు కలిసి సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షాని కలిశారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా సాధించిన అవార్డుల గురించి ప్రస్తావించిన అమిత్ షా చరణ్ ని సత్కరించారు. శుక్రవారం జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ ప్రోగ్రాం కి చరణ్ ఇన్విటేషన్ అందుకోగా ఢిల్లీ వచ్చిన చరణ్ ని కలిసి ముచ్చటించారు అమిత్ షా. ఇక ఈ మీటింగ్ లో చిరంజీవి లుక్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.చిరంజీవి స్లిమ్ లుక్ మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేసింది. వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు చిరు. సినిమా షూటింగ్ ఓ పక్క జరుగుతుండగా యూఎస్ నుంచి చరణ్ ఢిల్లీ వస్తున్నాడని తెలిసి చిరు కూడా ఢిల్లీ వెళ్లారు. అక్కడ యూనియన్ మినిస్టర్ తో కలిసి చిరు చరణ్ కాసేపు ముచ్చటించారు.

చిరంజీవి ఢిల్లీ వస్తున్నారని తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఆయన్ను కలిశారు. చరణ్ కి కూడా ఢిల్లీలో ఘనస్వాగతం పలికారు. చిరు చరణ్ ఇద్దరు కలిసి అమిత్ షాను కలిసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా ఫ్యాన్స్ అయితే బాస్ లుక్ కి ఫిదా అవుతున్నారు. భోళా శంకర్ తర్వాత చిరు నెక్స్ట్ సినిమా ఇంకా ఫైనల్ చేయలేదు. ప్రస్తుతం చిరు కథల వేటలో ఉన్నట్టు తెలుస్తుంది. తనయుడు చరణ్ తెచ్చుకుంటున్న ఈ మంచి పేరుని చూసి తండ్రిగా ఉప్పొంగి పోతున్నారు చిరు. ఆ ఆనందం ఆయన ముఖంలో బాగా కనిపిస్తుంది. అందుకే చిరు కూడా ఇదివరకు కన్నా చాలా ఉత్సాహంగా ఉంటున్నారు.

మరోపక్క చరణ్ కూడా ఆర్.ఆర్.ఆర్ తో వచ్చిన సూపర్ క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం చరణ్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు సీ.ఈ.ఓ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా ఉంటుందని తెలిసిందే. ఆ సినిమా గురించి కూడా చరణ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.