Begin typing your search above and press return to search.

కార్తికేయ 3 కోసం బాలీవుడ్ ఆఫర్స్.. రెండేళ్లు టైం అడిగిన మేకర్స్..!

By:  Tupaki Desk   |   29 March 2023 3:46 PM GMT
కార్తికేయ 3 కోసం బాలీవుడ్ ఆఫర్స్.. రెండేళ్లు టైం అడిగిన మేకర్స్..!
X
నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సినిమా సూపర్ హిట్ అయ్యింది. చందు మొండేటి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా 2014లో రిలీజై ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా సీక్వెల్ గా కార్తికేయ 2 అంటూ లాస్ట్ ఇయర్ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నిఖిల్. సినిమాను హిందీలో క్యాజువల్ గా రిలీజ్ చేస్తే అది అక్కడ అద్భుతాలు చేసింది. నార్త్ ఆడియన్స్ కార్తికేయ 2 సినిమా చూసి వావ్ అనేశారు. అంతేకాదు అంతకుముందు నిఖిల్ నటించిన సినిమాలన్నిటి మీద ఒక లుక్ వేశారు.

ఇక కార్తికేయ 2 ఎండింగ్ లోనే కార్తికేయ 3 గురించి చూపించారు. అయితే కార్తికేయ 3 మరింత భారీగా ఉండబోతుందని అర్ధమవుతుంది. కార్తికేయ 3 విషయంలో మేకర్స్ కి బాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయట. సినిమా నిర్మాణంలో భాగం అవుతామని అంటున్నారట. ఎంత బడ్జెట్ పెట్టినా సరే ఖర్చు పెట్టేందుకు రెడీ అంటున్నారట. అయితే కార్తికేయ 3 మేకర్స్ మాత్రం సినిమా నిర్మాణంలో ఎవరినీ భాగస్వామ్యం చేసే ఉద్దేశం లేదని అన్నారట.

అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న కార్తికేయ 3 సినిమా కార్తికేయ 2 కన్నా విజువల్ వండర్ లా ఉంటుందని అంటున్నారు. చందు మొండేటి ఇప్పటికే కార్తికేయ 3 కోసం స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టారు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు ఇంకా రెండేళ్లు టైం పడుతుందని అంటున్నారట. దర్శక నిర్మాతలు స్క్రిప్ట్ దశ నుంచే ఈ సినిమాను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే షూటింగ్ మొదలు పెట్టడమే ఆలస్యం సినిమాకు భారీ ప్రమోషన్ చేయాలని ఫిక్స్ అయ్యారట.

నిఖిల్ కూడా కార్తికేయ 3 సినిమా కోసం రెండేళ్లు టైం కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారు. మధ్యలో మరో సినిమా చేయకుండా పూర్తి ఫోకస్ కార్తికేయ 3 మీదే ఉంచాలని చూస్తున్నారట. ప్రస్తుతం స్పై తో పాటుగా మరో సినిమా చేస్తున్న నిఖిల్ ఈ సినిమాలు ముగించుకుని కార్తికేయ 3కి రెడీ అవుతాడని తెలుస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.