Begin typing your search above and press return to search.

కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి

By:  Tupaki Desk   |   23 April 2021 4:08 AM GMT
కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి
X
కరోనా మహమ్మారి మరో సినీ ప్రముఖుడిని బలి తీసుకుంది. కరోనా మొదటి వేవ్‌ సమయంలో పలువురు టాలీవుడ్‌ మరియు బాలీవుడ్‌ ప్రముఖులు మృతి చెందిన విషయం మర్చి పోకముందే సెకండ్‌ వేవ్‌ కారణంగా మరింత మంది ప్రముఖులు తుది శ్వాస విడుస్తున్నారు. టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ వరకు ఎంతో మంది ప్రముఖులు కరోనాతో కన్నుమూసిన వార్తలు వస్తూనే ఉన్నాయి. మరో బాలీవుడ్‌ ప్రముఖుడు కరోనాతో మృతి చెందారు. 1990ల్లో బాలీవుడ్‌ లో దిగ్గజ సంగీత దర్శకుడిగా పేరు దక్కించుకున్న శ్రవణ్‌ రాథోడ్‌ కన్నుమూశారు. కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి ముంబయిలోని ఎస్‌ఎల్‌ రాహెజ ఆసుపత్రిలో శ్రవణ్‌ రాథోడ్‌ తుది శ్వాస విడిచినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

బాలీవుడ్‌ 1990 ప్రేక్షకులకు నదీప్‌ సైఫీ మరియు శ్రవణ్‌ రాథోడ్‌ ల జోడీ ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలకు సంగీతాన్ని అందించాయి. వీరిద్దరిది హిట్‌ కాంబినేషన్‌ గా పేరు దక్కింది. వీరిద్దరి కలిసి బాలీవుడ్‌ కు ఎన్న బ్లాక్‌ బస్టర్‌ పాటలు అందించారు. 2005 వరకు కూడా వీరు సంగీతంతో అలరించారు. ఆ తర్వాత ఇద్దరు కూడా వేరు వేరుగా కొన్ని సినిమాలు చేశారు. కాని ఇద్దరు కలిసి చేసినంతగా మాత్రం ఆకట్టుకోలేక పోయారు. ఇద్దరు విడిపోవడం పై అప్పట్లో బాలీవుడ్‌ లో పెద్ద చర్చ అయితే జరిగింది.

శ్రవణ్‌ మృతిపై నదీప్‌ సైఫీ స్పందించారు. నా శాను ఇక లేడు. మేము ఇద్దరం పూర్తి జీవితాన్ని కలిసి చూశాం. మేము ఇద్దరం కలిసి ఎన్నో ఎత్తు పల్లాలను చూశాం. ఇద్దరం కలిసి పెరిగాం అంటూ సైఫీ భావోద్వేగంకు గురయ్యాడు. శ్రవణ్‌ రాథోడ్‌ మృతిపై బాలీవుడ్‌ ప్రముఖులు మీడియా వర్గాల వారు తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు. కరోనా బలి తీసుకున్న జాబితాలో శ్రవణ్‌ రాథోడ్‌ కూడా చేరడం ఆయన అభిమానులను తీవ్రంగా కలచి వేస్తోంది.