Begin typing your search above and press return to search.

2022 సెకండాఫ్ అయినా పాన్ ఇండియాలో కొడ‌తారా?

By:  Tupaki Desk   |   25 Jun 2022 5:30 AM GMT
2022 సెకండాఫ్ అయినా పాన్ ఇండియాలో కొడ‌తారా?
X
ట్రిగ్గ‌ర్ నొక్కగానే బుల్లెట్ దూసుకెళుతుంది. కానీ అది పాన్ ఇండియాని ఢీకొట్ట‌గ‌ల‌దా? అన్నదే ఇప్పుడు క్వ‌శ్చ‌న్. ఇది బాలీవుడ్ కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ప్ర‌శ్న‌గా మారింది. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఈ ఏడాది అంతా నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ నుంచి విడుద‌ల‌వుతున్నాయి. ఇందులో రెండు ర‌ణ‌బీర్ కపూర్ న‌టించిన‌వే. అత‌డు న‌టించిన బ్ర‌హ్మాస్త్ర‌- షంషేరా పాన్ ఇండియా రేస్ లో విడుద‌ల‌వుతున్నాయి. అయితే వీటిలో శంషేరా మాత్ర‌మే జూలై 22న వ‌స్తోంది. అంటే ప్ర‌థ‌మార్థంలో రిలీజైపోతుంది. ఇక బ్ర‌హ్మాస్త్ర 2022 సెప్టెంబ‌ర్ లో విడుద‌ల‌వుతుంది.

ఇక ఈ ఏడాది ద్వితీయార్థంలో చాలా బాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా రేస్ లోకి వ‌స్తున్నాయి. వీటిలో రామ్ సేతు vs థాంక్ గాడ్.. లాల్ సింగ్ చద్దా vs రక్షా బంధన్ ఉన్నాయి. 2022 ద్వితీయార్థంలో విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న 5 పెద్ద సినిమాల వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే...

అక్షయ్ కుమార్ న‌టిస్తున్న 'రక్షా బంధన్' ..'రామ్ సేతు' విడుద‌ల కానుండ‌గా.. అమీర్ ఖాన్ న‌టించిన లాల్ సింగ్ చద్దా.. అజయ్ దేవగన్ న‌టించిన 'థాంక్స్ గాడ్‌' విడుద‌ల కానున్నాయి.

అక్షయ్ కుమార్ - భూమి పెడ్నేకర్ నటించిన 'రక్షా బంధన్' 11 ఆగస్టు 2022న విడుదల కానుంది. అమీర్ ఖాన్ - కరీనా కపూర్ ఖాన్- నాగ‌చైత‌న్య‌ నటించిన లాల్ సింగ్ చద్దా కూడా అదే తేదీన పెద్ద స్క్రీన్ లలోకి షెడ్యూల్ చేస్తున్నారు. రక్షా బంధన్ వాయిదా పడే అవకాశం ఉందని ఊహించారు. కానీ వాయిదా లేదు. ఈ స్వాతంత్ర‌ దినోత్సవ వారాంతంలో ఇరు చిత్రాల న‌డుమా బాక్సాఫీస్ ఘ‌ర్ష‌ణ‌కు రంగం సిద్ధ‌మైంది.

బాక్సాఫీస్ వద్ద అమీర్ ఖాన్ వ‌ర్సెస్ అక్షయ్ కుమార్ వార్ త‌ర్వాత అక్షయ్ టిక్కెట్ విండో వద్ద అజయ్ దేవగన్ తో ఫైట్ చేస్తాడు. అక్ష‌య్ న‌టించిన‌ రామ్ సేతు వ‌ర్సెస్ దేవ‌గ‌న్ న‌టించిన‌ థాంక్స్ గాడ్ పోటీ ర‌న్ కానుంది. ఈ సినిమాలు ఈ ఏడాది దీపావళికి విడుదల కానున్నాయి.

హృతిక్ రోషన్ - సైఫ్ అలీ ఖాన్ నటించిన 'విక్రమ్ వేదా'తో మ‌ణిర‌త్నం పొన్నియ‌న్ సెల్వ‌న్ పోటీప‌డ‌నుంది. చియాన్ విక్రమ్ - ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటించిన పొన్నియిన్ సెల్వన్ 30 సెప్టెంబర్ 2022 న పెద్ద స్క్రీన్ లలోకి రానుంది. మొదటిది హిందీ చిత్రం అయితే.. రెండవది తమిళ చిత్రం.. మ‌ణిరత్నం పొన్నియ‌న్ సెల్వ‌న్ పాన్-ఇండియా కేట‌గిరీలో విడుద‌లవుతోంది. హిందీ సహా పలు భాషల్లోకి డబ్ అవుతుంది. ఈ సంవత్సరం సౌత్ డబ్బింగ్ సినిమాలదే హవా. కాబట్టి పొన్నియిన్ సెల్వన్ బాక్సాఫీస్ వద్ద విక్రమ్ వేదకు గట్టి పోటీ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని బాలీవుడ్ మీడియా విశ్లేషిస్తోంది.

అదే వారాంతంలో కంగనా రనౌత్ వ‌ర్సెస్ కరణ్ జోహార్ వార్ కొన‌సాగ‌నుంది. కంగనా నటించిన తేజస్ చిత్రం 5 అక్టోబర్ 2022న విడుదల కానుంది. రాజ్ కుమార్ రావ్ -జాన్వీ కపూర్ తారాగ‌ణంగా కరణ్ జోహార్ నిర్మించిన‌ 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' విడుద‌ల‌కు వ‌స్తోంది. ఈ మూవీ అక్టోబర్ 7న విడుదల కానుంది. విడుదల తేదీకి రెండు రోజుల గ్యాప్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వార్ ఇరు సినిమాల న‌డుమా కొన‌సాగుతుంది.

రణవీర్ సింగ్ - సర్కస్.. టైగర్ ష్రాఫ్- గణపత్,.. కత్రినా కైఫ్ - విజయ్ సేతుపతిల మెర్రీ క్రిస్మస్ ఒకే రోజున విడుదలకు సిద్ధంగా ఉన్నందున ఈసారి క్రిస్మస్ 2022 కి బాక్స్ ఆఫీస్ వద్ద త్రిముఖ పోటీ నెల‌కొంది. గణపత్ వాయిదా పడవచ్చని క‌థ‌నాలు వ‌చ్చినా దాని గురించి అధికారిక ప్రకటన లేదు. ఆ త‌ర్వాత ర‌ణ‌బీర్ న‌టించిన బ్ర‌హ్మాస్త్ర సెప్టెంబ‌ర్ లో విడుద‌ల కానుంది. అయితే హిందీ సినిమాల్లో ఏవి పాన్ ఇండియాలు అంటే బ్ర‌హ్మాస్త్ర‌- షంషేరా- రామ సేతు-లాల్ సింగ్ చ‌ద్దా- సర్క‌స్ చిత్రాల‌ను చెబుతున్నారు. ఇవ‌న్నీ హిందీ మార్కెట్ తో పాటు సౌత్ మార్కెట్లోనూ భారీగా విడుద‌ల కానున్నాయ‌న్న టాక్ ఉంది. వీటితో పాటు మ‌ణిరత్నం పొన్నియ‌న్ సెల్వ‌న్ కూడా పాన్ ఇండియా కేట‌గిరీలో ప‌లు భాష‌ల్లో విడుద‌ల కానుంది. అయితే వీటిలో ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ రికార్డుల‌ను తిరిగ‌రాసే సినిమాలేవీ? అన్న‌ది సస్పెన్స్. ముఖ్యంగా హిందీ చిత్రాల్లో 1000 కోట్ల క్ల‌బ్ చేరేవి ఏవి? అన్న‌ది వేచి చూడాలి.