పూరి మోసపోయినట్లే ఆ నటుడకి 200 కోట్లు టోకరా?

Sat Mar 18 2023 18:29:08 GMT+0530 (India Standard Time)

Bollywood's actor has recently come to light

ఆ మధ్య డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి  100 కోట్ల రూపాయలకు టోకరా వేసిన సంగతి తెలిసిందే. నిత్యం తన చుట్టూ ఉండే వ్యక్తే ఈ మోసానికి పాల్పడినట్లు పూరి ఎన్నోసార్లు చెప్పారు. ఆ మనిషిని గుడ్డిగా నమ్మడం వల్ల 100 కోట్లు పోగోట్టుకున్నాను-జీవితంలో అదొక పెద్ద గుణ పాఠమని అన్నారు. నీ నీడను కూడా నువ్వు నమ్మకూడదు అన్న విషయం పూరికి అప్పుడే అర్ధమైందన్నారు.



నమ్మిన వాడే మోసం చేస్తే ఆ  పెయిన్ అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుందని ఎన్నోసార్లు చెప్పారు. అప్పటి నుంచి డబ్బు విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నారు. ఎవర్ని పడితే వాళ్లని నమ్మడం మానేసారు.

మనీ ట్రాన్సాజాక్షన్ అంతా జాగ్రత్తగా తానే చూసుకుంటున్నట్లు తెలిపారు. అంత పెద్ద మోసం చేసినా పూరి అతనిపై కేసు కూడా పట్టలేదు. దయా హృదయంతో వదిలేసారు. కేసులు పెట్టి తాను సాధించేది ఏమీ ఉండదని...అతని పై కక్ష సాధింపుకు దిగలేదని అన్నారు.

అయితే సరిగ్గా ఇదే అనుభవం ఓ బాలీవుడ్ కి లెజెండరీ నటుడుకి ఎదురైటన్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ సూపర్ స్టార్ కూడా ఎప్పుడూ అతనుంటాడుట. ఆ నటుడికి సంబంధించిన మనీ వ్యవహారమంతా తానే దగ్గరుండి చూసుకుంటాడుట. కొన్నాళ్లగా పనిచేయడంతో నమ్మకంతో అన్ని బాధ్యతలు ఆ వ్యక్తే  చూసుకున్నాడుట. అలా నమ్మిన నటుడికే టోకరా వేసినట్లు  తెలుస్తోంది.

దాదాపు 200 కోట్ల రూపాయలు నొక్కేసినట్లు సమాచారం. అయితే ఆ వ్యక్తి స్నేహితుడో?  దూరపు బంధువో కాదు. అత్యంత దగ్గర బంధువట. ఎంతో నమ్మకంతో దగ్గర పెట్టుకుంటే అతను చేసిన ఘనకార్యం ఇదా? అని ఆ నటుడు ఆశ్చర్యపోయాడుట.

అయితే  కుటుంబ సభ్యుడు కావడంతో ఆ నటుడు మోసగాడిపై ఎలాంటి కేసులు పెట్టలేదుట. లోలోపల కుమిలిపోవడం తప్ప! కేసులు పెట్టి సాధించేది ఏమీ  లేదని సైలెంట్ అయిపోయారుట. అయితే ఈవిషయంపై ఆ కుటుంబంలో తరుచూ గొడవలు జరుగుతు న్నాయట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.